అవతార్ మిస్ చేసుకొన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? జేమ్స్ కామెరాన్ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందెవరంటే?

ప్రపంచ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ వసూళ్ల సినిమా టాపిక్ వస్తే అందులో దాదాపు దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన సినిమాలే ముందు వరుసలో ఉంటాయని చెప్పాలి. ఇపుడు ఉన్న టికెట్ రేట్లు, 3డి రిలీజ్ లు లేకుండా కూడా జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఎపిక్ వండర్స్ రికార్డు నంబర్స్ అందుకొని సంచలనం సెట్ చేసాయి.

కాగా ఇలా తాను చేసిన ఎన్నెన్నో వండర్స్ లో "అవతార్" సినిమా అయితే ప్రపంచ సినిమానే మర్చిపోలేదు. తనకి ఒక టైంలో వచ్చిన కలని సినిమాలా తెరకెక్కించి జేమ్స్ కామెరాన్ యావత్తు ప్రపంచ సినిమానే విస్మయానికి లోను చేశారు. కాగా జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ సినిమా విషయంలో కానీ తన విషయంలో కానీ మన భారతీయ ఇతిహాసాల ప్రభావం పలు అంశాల్లో కనిపించింది.

bollywood actor govinda shocking comments on james cameron avatar movie

ఎక్కడికో ఎందుకు మన దేశపు సంస్కృత పేరు "అవతార్" అనే పేరుని ఈ సినిమాకి తాను పెట్టుకున్నారు. ఇక్కడే తన సినిమా మన దేశపు చరిత్రతో ఇమిడి ఉంది అని అర్ధం అవుతుంది. కాగా అసలు ఈ సినిమా టైటిల్ నేనే చెప్పాను అంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా చేసిన కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. కాగా గోవిందా లేట్ 90ల సమయంలో బాలీవుడ్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

కాగా అలా అవతార్ సినిమా మొదలు కావడానికి ముందు అంటే 2000 సంవత్సరం సమయంలోనే తనకి జరిగిన కొన్ని ఘటనలు మన ఇండియన్ సూపర్ హీరో శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నాతో చేసిన పాడ్ కాస్ట్ లో రివీల్ చేశారు. కాగా తాను అప్పట్లో యూఎస్ లో ఉన్నపుడు ఒక సింగ్ కి బిజినెస్ ఐడియా ఇస్తే అది హిట్ అయ్యి వారు జేమ్స్ కామెరాన్ ని కలిసి ఒక డిన్నర్ ఏర్పాటు చేశారు అని కాగా ఆ సమయంలోనే జేమ్స్ కామెరాన్ తనకి ఆ కథ చెబితే అప్పుడు అవతార్ అనే టైటిల్ ని పెట్టమని నేనే సజెస్ట్ చేశాను అంటూ గోవిందా తెలిపారు.

bollywood actor govinda shocking comments on james cameron avatar movie

ఇక ఇది మాత్రమే కాకుండా తనని ఈ సినిమాలో కామెరాన్ నటించమని కూడా అడిగారని అప్పట్లోనే తనకి 18 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తాను అని చెప్పారని తెలిపారు. అయితే అప్పుడు తనకి 400 రోజులకి పైగా కాల్షీట్స్ అడిగితే ఓకే అన్నాను కానీ అన్ని రోజులు ఒంటికి నీలం రంగు పూసుకొని ఉండాలని చెప్పేసరికి తన ఆరోగ్యం విషయంలో రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు అని ఆ భారీ ఆఫర్ ని తాను వదులుకున్నట్టుగా గోవిందా తెలిపారు.

Take a Poll

దీనితో తన నుంచి ఈ ఊహించని కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక కామెరాన్ నుంచి ఆల్రెడీ గత 2022 లో వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా కూడా 2 బిలియన్ కి పైగా వసూళ్లు అందుకుంది, ఇక మూడో భాగంగా అవతార్ ది యాష్ అండ్ ఫైర్ అనే సినిమా ఈ 2025 డిసెంబర్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు. కాగా జేమ్స్ కామెరాన్ మొత్తంగా పంచ భూతాలని టచ్ చేసే విధంగా సినిమాలు ప్లాన్ చేసుకున్నారు.

More from Filmibeat

Read more about: avatar 2 avatar 3 govinda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X