హాస్పిటల్‌లో చేరిన బాలీవుడ్ నటుడు.. క్లిష్టమైన సర్జరీ కోసం..
బాలీవుడ్‌లో వరుస మరణాలతో విషాదంలో మునిగిపోయిన తరుణంలో హీరో రణదీప్ హుడా హాస్పిటల్‌లో చేరారనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం హస్పిటల్‌లో చేరడంతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల్లో కలవరం మొదలైంది. అయితే రణ్‌దీప్ హాస్పిటల్‌లో చేరడానికి కారణమేమిటంటే..

ప్రముఖుల మరణాలతో విషాదంలోకి
రిషి కపూర్, ఇర్ఫాన్, సరోజ్ ఖాన్, సుశాంత్ లాంటి సినీ ప్రముఖుల మరణాలు అభిమానులను విషాదంలో ముంచెత్తాయి. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీ కరోనా బారిన పడటం ఆందోళనకు గురయ్యారు. సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడటం మరింత కుంగతీసింది. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో హీరో రణ్‌దీప్ హుడా అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు.

కోవిడ్ నెగిటివ్ అని తేలినప్పటికీ..
తాజా సమాచారం ప్రకారం.. రణదీప్ హుడా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. అయితే ఆయన ఓ మేజర్ సర్జరీ కోసం హాస్పిటల్‌లో చేరారు అని సన్నిహితులు తెలిపారు. అయితే ఆయన ఎలాంటి వ్యాధికి ట్రీట్‌మెంట్ జరుగుతుందనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.

కొద్ది రోజుల క్రితమే ఉత్సాహంగా బర్త్ డే
కొద్దిరోజుల క్రితమే రణ్‌దీప్ హుడా జన్మదినాన్ని జరుపుకొన్నారు. బర్త్ డే గిఫ్టుగా వచ్చిన సైకిల్‌పై హెల్మెట్ పెట్టుకొని కనిపించారు. టీ షర్టు, డెనిమ్ షార్టులో ఉత్సాహంగా కనిపించిన ఆయన అకస్మాత్తుగా హాస్పిటల్ చేరడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో ముఖానికి మాస్క్ కట్టుకొని కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.
Recommended Video

రణ్‌దీప్ హుడా కెరీర్
హైవే లాంటి చిత్రాలతో విశేషంగా అభిమానుల మెప్పుపొందిన రణ్‌దీప్ హుడా టాలెంటెడ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ఎక్ట్రాక్షన్ ఇటీవలే రిలీజైంది. క్రిస్ హెమ్స్ వర్త్ లాంటి నటులతో కలిసి నటించారు. సల్మాన్ ఖాన్, దిశా పటానీ నటిస్తున్న రాధే చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. మరో హాలీవుడ్ చిత్రం ర్యాట్ ఆన్ హైవే, మర్ధ్ చిత్రంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











