వాళ్ల అక్కను పెళ్లి చేసుకుని ఉంటే నా పని గోవిందా .. స్టార్ హీర్ సంచలన వ్యాఖ్యలు
గడిచిన కొన్ని రోజులుగా విడాకులు, పెళ్లి అనే వ్యవహారాలు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. సెలబ్రెటీ జంటలు విడిపోవడానికి సిద్ధపడుతుంటంతో ఈ తరహా న్యూస్ ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. సమాజంలో పెరుగుతున్న ఈ పోకడపై సాంప్రదాయవాదులు కన్నెర్ర చేస్తుంటే .. అందుకు దారి తీసే కారణాలపై మానసిక వైద్యులు, నిపుణులతో పలు ఛానెల్స్ గంటల తరబడి చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విడాకులపై పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఇదిలాఉండగా.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. సినిమాల కంటే ముందు ఇతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్దది. పటౌడీ రాజవంశానికి వారసుడైన సైఫ్ అలీ ఖాన్.. అలనాటి క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ- సినీనటి షర్మిలా ఠాగూర్ కుమారుడు . 1993లో పరంపరతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సైఫ్ అలీ ఖాన్ తనదైన నటనతో మూడు దశాబ్ధాలుగా అలరిస్తున్నారు. యాక్టింగ్, ఫిట్‌నెస్, వ్యక్తిగత జీవితం.. ఇలా సైఫ్‌కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటుంది. స్వతహాగా రాజవంశం కావడంతో సైఫ్ అలీఖాన్ వేల కోట్ల ఆస్తులకు వారసుడు.. పూర్వీకులు ఇచ్చిన దానికి తను సంపాదించినది తోడవ్వడంతో ఆయన బిలియనీర్‌గా వెలుగొందుతున్నారు.

అన్నింటిలోకి పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ ప్రత్యేకమైనది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజప్రసాదాన్ని ఇబ్రహీం కోఠిగా పిలుస్తారు. ఇందులో 150 గదులు, ఏడు పడక గదులు ఉంటాయట. ఈ పటౌడీ ప్యాలెస్ విలువ రూ. వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు ఆయన రూ.10 నుంచి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని బీటౌన్ టాక్. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ఓటీటీ వెంచర్ల ద్వారా రూ.28 నుంచి రూ.30 కోట్ల వరకు సైఫ్ అలీ ఖాన్ సంపాదిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
స్టార్ హీరో, రాజవంశం అయినంత మాత్రాన ఆయనేమీ కష్టాలకు అతీతం కాదు. సగటు మనిషిగా వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 21 ఏళ్ల వయసులోనే 1991లో బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో సైఫ్ అలీ ఖాన్ పెళ్లయ్యింది. ఈ దంపతులకు సోహా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ సంతానం. 2004లో ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. సైఫ్ నటి రోసాతో డేటింగ్ చేశారు. అయితే అనివార్య కారణాలతో వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది. అనంతరం 2012లో తన సహ నటి కరీనా కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వారికి తైమూర్, జై అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే విడాకులు ఇచ్చిన సమయంలో తనను ఎంతోమంది విమర్శించారని.. నా తల్లిని, చెల్లిని అనరాని మాటలు అన్నారని.. కానీ వాటిని భరించి అధిగమించానని సైఫ్ అలీఖాన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు. తన మాజీ భార్యకు రూ.5 కోట్లు భరణంగా ఇచ్చానని.. తన కొడుక్కి 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ. లక్ష పంపానని.. ఆ డబ్బు సంపాదించేందుకు ఎంతో కష్టపడ్డానని సైఫ్ గుర్తుచేసుకున్నారు.

తన భార్య కరీనా కపూర్ సోదరి కరిష్మా కపూర్‌తో పలు సినిమాల్లో నటించిన సైఫ్ అలీ ఖాన్ .. ఆమె గురించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. కరీనాను పెళ్లిచేసుకోబట్టి సరిపోయింది గానీ.. కరిష్మాను చేసుకుంటే అయిపోయేవాడినంటూ సరదాగా చెప్పారు. ఏసీ రిమోట్ కోసమే ఎన్నోసార్లు గొడవపడ్డామని.. ఇక పెళ్లి చేసుకుంటే రోజుకు ఎన్ని గొడవలు జరుగుతాయోనని సైఫ్ అలీఖాన్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











