మహేశ్ బాబు పోస్టుపై సోనూసూద్ షాకింగ్ కామెంట్.. అసలేం జరిగిందంటే ?
Mahesh Babu-SonuSood: బాలీవుడ్ నటుడు సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో తన విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. 'అరుంధతి' సినిమాలో పశుపతిగా నటించి తెలుగుపేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇక కరోనా సమయంలో దేశ ప్రజలకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పై బాలీవుడ్ సోనూసూద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
బాలీవుడ్ నటుడు సోను సూద్ దర్శకుడుగా మారారు. తన స్వీయ దర్శకత్వంలో జి స్టూడియోస్ సమర్పణలో సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా ఓ సైబర్ క్రైమ్ యాక్షన్ త్రిల్లర్ తెరకెక్కుతుంది. అదే ఫతే (Fateh).. ఈ సినిమాలో నజీరుద్దీన్ షా, విజయ్ రాజ్ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేశారు. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు.

ఫతే (Fateh).. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీ యూనిట్.. ప్రమోషన్స్లలో బిజీబిజీగా మారింది. అలాగే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులనే కాకుండా సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సోను సూన్ పై ప్రశంసలు కురిపిస్తూ పలువురు విషెస్ చెబుతున్నారు.
సోనుసూద్ 'ఫతే' మూవీ ట్రైలర్ పై తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కూడా సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై కామెంట్ చేశాడు. 'యాక్షన్ ఫాక్ట్ గా సిద్ధమైన ఈ ట్రైలర్ చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంది. మై డియర్ ఫ్రెండ్ ఆల్ ది బెస్ట్.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను వెండితెరపై చూడాలని కోరుకుంటున్నా..' అంటూ మహేష్ బాబు ట్విట్ చేశాడు. ఈ తరుణంలో మహేష్ బాబు ట్విట్ పై హీరో సోను సూద్ స్పందించారు. 'ఐ లవ్ యు బ్రదర్. మనమిద్దరం కలిసి ఈ సినిమాను చూద్దాం' అంటూ రిప్లై ఇచ్చారు.
Love you brother.
— sonu sood (@SonuSood) January 6, 2025
Will watch the film together ❤️ https://t.co/06F6Iqufv3
మహేష్ బాబు సోనూసూద్ లు కలిసి దూకుడు ఆగడు సినిమాలలో నటించారు. ఈ సినిమాలలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇలా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫతే' సినిమాపై పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తూ సోనుసూదినం అభినందిస్తున్నారు. సోనుసూద్ ఫ్యాన్స్ నుండి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.


Click it and Unblock the Notifications











