Shah Rukh Khan: ఆ సినిమాలు చేసినందుకు బాలీవుడ్ బాద్ షాకు బెదిరింపులు, వై+ భద్రత కల్పించిన సర్కారు

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల చేసిన రెండు సినిమాలు.. జవాన్, పఠాన్ లు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. బాక్సాఫీసులను షేక్ చేసిన ఈ రెండు సినిమాలే ఆయనకు కొన్ని చిక్కులు తెచ్చి పెట్టాయి. అదేంటీ అనుకుంటున్నారా.. అవునండి. ఆయన ఆ సినిమాల్లో నటించిన తర్వాత నుంచి షారుఖ్ కు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. అతడిని చంపేస్తామంటూ ఫోన్లు, ఉత్తరాలు వస్తున్నాయి.

ముంబయిలో ఆయన నివాసం మన్నత్ కు ఆయనను బెదరిస్తూ.. చాలానే లేఖలు వ్చచాయి. అవి చూసి భయపడిపోయిన బాద్ షా, ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తనను బెదిరిస్తూ వస్తున్న ఫోన్ కాల్స్, లేఖల గురించి వివరించారు. ఈక్రమంలోనే తనకు మరింత భద్రత కల్పించాలని కోరారు. ఆయన విజ్ఞప్తిపై మహారాష్ట్ర సర్కారు స్పందించింది. షారుఖ్ ఖాన్ కు ఎలాంటి సమస్యా లేకుండా చూసేందుకు ముందుకు వచ్చింది.

Bollywood badh Shah Shar Rukh Khan gets Y Plus Security

షారుఖ్ ఖాన్ కు కల్పించిన భద్రతను మరింత పెంచింది. వై ప్లస్ కేటగిరీగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బాలీవుడ్ బాద్ షాకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసేందుకు మొత్తం ఆరుగు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయించింది. అయితే ఈ ఆరుగురు సిబ్బంది మూడు షిఫ్టుల్లో ఆయనకు భద్రత కల్పించనున్నారు.

Bollywood badh Shah Shar Rukh Khan gets Y Plus Security

ఈ ఏడాది జనవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన పఠాన్ సినిమా పెద్ద ఎత్తున వసూళ్లు సాధించింది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై షారుఖ్ సతీమణి గౌరీఖాన్ ఈ చిత్రాన్ని నిర్చింగా.. గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించారు. దీపికా, షారుఖ్ లు హీరోహీరోయిన్లుగా చేసిన నాలుగో చిత్రమిది. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి వరల్డ్ వైడ్ సాలిడ్ హిట్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై వివాదం నెలకొంది.

ఈ పాఠలో దీపికా పదుకొణె కుంకుమ పువ్వు బికీనీ ధరించడంపై అనేక మంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లోనే హీరోకు బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం షారుఖ్ ఖాన్ కు వీఐపీ భద్రత కల్పించింది. మొత్తం ఆరుగురు సిబ్బందిని నియమించగా... వారు షారుఖ్ తో పాటు ఆయన ఫ్యామిలీకి రక్షణ కల్పించారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రత స్థాయిని మరింతగా పెంచారు.

Bollywood badh Shah Shar Rukh Khan gets Y Plus Security

అలాగే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై షారుఖ్ సతీమణి గౌరీఖాన్ నిర్మించారు. ఈ చిత్రం 1100 కోట్ల రూపాయలను రాబట్టి రికార్డుకెక్కింది. ముఖ్యంగా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా రికార్డు సాధించింది. ఈ సినిమా రిలీజ్ అయి నెల గడుస్తున్నా ఇంకా వసూళ్ల వేట కొనసాగిస్తోంది. ఈక్రమంలోనే షారుఖ్ కు బెదిరింపులు రావడం గమనార్హం.

More from Filmibeat

Read more about: shah rukh khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X