twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంకుల్ నుంచి 25 ఏళ్ల కుర్రాడిలా.. 18 కేజీల బరువు తగ్గించుకొన్న హీరో.. ఎన్ని రోజుల్లో అంటే!

    |

    బాలీవుడ్‌లో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వెండి తెర మీద రాణించిన హీరోల్లో ఫర్దీన్ ఖాన్ ఒకరు. వారసుడిగా రంగ ప్రవేశం చేసినప్పటికీ సొంతంగా ఇమేజ్ సంపాదించుకొన్నారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రపంచానికి దూరమయ్యారు. అయితే చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే పర్ధీన్ ఖాన్ డిప్రెషన్‌కు లోనైన విపరీతంగా లావెక్కడంతో ఎవరూ గుర్తుపట్టని విధంగా రూపు రేఖలు మారిపోయాయి. అయితే ఇటీవల మళ్లీ సన్నబడి పూర్వ వైభవంతో కళకళలాడుతూ కనిపించారు. ఈ క్రమంలో ఫర్దీన్ ఖాన్ గురించి మరిన్నీ వివరాలు..

    అలనాటి సూపర్ స్టార్ కుమారుడిగా

    అలనాటి సూపర్ స్టార్ కుమారుడిగా


    బాలీవుడ్‌లో అలనాటి హీరో, నిర్మాత, ప్రముఖ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ కుమారుడే ఫర్దీన్ ఖాన్. 1998లో ప్రేమ్ అగన్ అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 2000 నాటికి పలు హిట్లను తన ఖాతాలో వేసుకొని స్టార్ స్టేటస్‌ను సంపాదించుకొన్నారు. అయితే 2010 తర్వాత స్టార్ రేసులో వెనుకబడిపోయారు.

    రాంగోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాల్లో

    రాంగోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాల్లో

    ప్రము దర్శకుడు రాంగోపాల్ దర్శకత్వం వహించి, నిర్మించిన పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ఆర్జీవి నిర్మించిన జంగిల్, ప్యార్ తూనే క్యా కియా, లవ్ కే లియే కుచ్ బి కరేగా, భూత్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే నటుడు అనుపమ్ ఖేర్ దర్శకుడిగా మారి రూపొందించిన ఓం జై జగదీష్ చిత్రంలో కూడా నటించారు. ఆ తర్వాత ఫిదా, దేవ్, నో ఎంట్రీ, ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా, హే బేబీ లాంటి చిత్రాల్లో నటించారు. చివరి సారిగా 2010లో దుల్హా మిల్ గయా చిత్రంలో కనిపించారు.

    ఫర్దీన్ ఖాన్ పని ఖతం అంటూ

    ఫర్దీన్ ఖాన్ పని ఖతం అంటూ

    ఆ తర్వాత అవకాశాలు తగ్గడం, వ్యక్తిగత సమస్యలు పెరిగిపోవడంతో ఫర్దీన్ ఖాన్ స్థూలకాయంతో కనిపించడంతో అంతా హీరో పని ఖతం అనే ఫిక్స్ అయిపోయారు. అయితే తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్‌ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో శారీరక బరువును తగ్గించుకొనేందుకు కష్టపడ్డారు.

    బాడీ షేమింగ్‌పై స్పందిస్తూ

    బాడీ షేమింగ్‌పై స్పందిస్తూ


    తన శరీరంపై బాడీ షేమింగ్ కామెంట్స్ రావడంపై స్పందిస్తూ.. సిగ్గుపడటం లేదు. మీ వ్యాఖ్యలతో బాధపడటం లేదు. అంతేకాకుండా నేను డిప్రెషన్‌కు గురికాలేదు. కానీ సంతోషంగా మాత్రం ఉన్నాను అంటూ ఫర్దీన్ ఖాన్ అన్నారు. బరువు తగ్గించుకొనే కార్యక్రమాన్ని ఓ బాధ్యతగా, ఓ తపస్సులా భావించాను అంటూ ఫర్దీన్ ఖాన్ అన్నారు.

    25 ఏళ్ల కుర్రాడిలా మారిపోవాలనుకొన్నా

    25 ఏళ్ల కుర్రాడిలా మారిపోవాలనుకొన్నా

    నా బరువు పెరగడం గురించి బాగా ఆలోచించాను. దాదాపు చాలా బరువు తగ్గించుకొని 25 ఏళ్ల కుర్రాడిలా మారిపోవాలనుకొన్నాను. నా మైండ్‌ను, బాడీని సింక్ చేశాను. దాదాపు 6 నెలల్లో అంటే 180 రోజుల్లో అనుకున్నది సాధించి 18 కేజీల బరువును తగ్గాను. ఇంకా నా ప్రయత్నం ఆగలేదు. ఇంకా 35 శాతం బరువును తగ్గించుకోవాలనుకొంటున్నాను అని ఫర్దీన్ ఖాన్ చెప్పడమే కాదు.. ఎందరికో స్పూర్తిగా నిలిచారు.

    Recommended Video

    Bollywood Actor Pankaj Tripathi's Special Interview Part 2 | Filmibeat Telugu
    సరైన వర్కవుట్లతోనే అంటూ

    సరైన వర్కవుట్లతోనే అంటూ

    ఇటీవల క్యాస్టింగ్ డైరెక్టర్, డైరెక్టర్ ముఖేష్ చాబ్రా ఆఫీస్‌లో మెరిసిన ఫర్దీన్ ఖాన్ తన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతూ.. నేను పెద్దగా కష్టపడలేదు. హాయిగా హెల్తీ ఫుడ్ తిన్నాను. ప్రశాంతంగా నిద్రపోయాను. కానీ రోజు సరైన వర్కవుట్లు చేశాను. దాని ఫలితమే మళ్లీ ఈ రూపం దక్కింది అంటూ ఫర్దీన్ ఖాన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

    English summary
    Bollywood hero Fardeen Khan physical transfromation inspiring everyone in public life. Bollywood Hero lost18 kg weight in 6 months. He said. I started eating right and healthy, coupled it with correct workouts. I have lost 18 kg in the last six months
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X