కరోనా కష్టకాలంలో అత్యదిక విరాళమిచ్చిన స్టార్ హీరో.. మొత్తం ఎంతంటే..
కరోనా వైరస్ కొట్టిన దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో వెనుకబడిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటికి కనిపించని ఒక అతి చిన్న వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా ఏ ఆధారం లేని పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ కరోనా కష్టకాలంలో ఆదుకున్న మహానుభావులందరికి వందనాలు చెప్పాల్సిందే. అందులో కొంతమంది స్టార్ హీరోలు భారీగా విరాళాలు అందించారు. మొదట ఎక్కువగా డోనేషన్స్ ఇచ్చిన హీరో అక్షయ్ కుమార్ అనే చెప్పాలి.

సినిమాలతోనే కాకుండా మంచి పనులతో కూడా..
అక్షయ్ కుమార్ వెండితెరపై ఎంత చురుగ్గా కనిపిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎంతో కష్టపడి బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్షయ్ సినిమాలతోనే కాకుండా తన మంచి పనులతో జనాల మనసుకు ఎంతగానో దగ్గరయ్యాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎక్కువగా స్పందించిన హీరో అక్షయ్ కుమారే..

కోవిడ్ వైద్యం కోసం ఏకంగా 24కోట్లు..
లాక్ డౌన్ లో రూల్స్ ని సక్రమంగా ఫాలో కావాలని సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే నడిపాడు అక్షయ్. ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా మంచి సందేశాలను అందించాడు. కేవలం మాటలతోనే కాకుండా చేతనైనంత సహాయం కూడా చేయాలని ముందుగా తనవంతు సహాయాన్ని అందించాడు. కోవిడ్ వైద్యం కోసం ఏకంగా 24కోట్ల రూపాయల సహాయాన్ని ప్రభుత్వానికి అందించాడు.

మరో మూడు కోట్ల విరాళం
ఆర్ధిక సహాయలు అందించడం అక్షయ్ కుమార్ కి ఇది కొత్తేమి కాదు. కెరీర్ మొదటి నుంచి ఎదో ఒక రకంగా తనదైన శైలిలో కష్టల్లో ఉన్నవారికి సహాయం చేస్తూనే ఉన్నాడు. కరోనా కష్ట కాలంలో 24కోట్ల విరాళంతో పాటు రీసెంట్ బీఎంసి కోసం మరో మూడు కోట్లను అందించినట్లు తెలుస్తోంది. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా శ్రమిస్తున్న కార్మికుల కోసం సీపీఐ కిట్లు తయారు చేసేందుకు అలాగే క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ నిధిని ఉపయోగించాలని కోరినట్లు సమాచారం.
Recommended Video

మొత్తం డోనేషన్స్ ఎంతంటే..
మొత్తంగా 27కోట్ల డోనేషన్ ని అందించిన అక్షయ్ కుమార్ దేశ ప్రజల మనసుకు మరింత దగ్గరయ్యాడు. గతంలో మరణించిన దేశ సైనికుల యొక్క కుటుంబాల కోసం కూడా అక్షయ్ కుమార్ భారీ విరాళాలు అందించాడు. ఇక కొంతమంది పేద విద్యార్థులకు కూడా అక్షయ్ తన సొంత ఖర్చులతో మెరుగైన విద్యను అందిస్తున్నాడు. ఇక అక్షయ్ పై నెటీజన్స్ ఈ విధంగా స్పందిస్తూ.. నిజంగా బాలీవుడ్ లో ఖాన్ త్రయం హీరోల కంటే అక్షయ్ కుమార్ వంద రెట్లు గొప్పవాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











