Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓకే సెట్ లో బాలీవుడ్ అగ్ర హీరోతో విజయ్.. ఫొటో లీక్.. ఫ్యాన్స్ కు పండగే!
తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్ ప్రస్తుతం వారసుడు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒకేసారి తమిళ్ తెలుగులో విడుదల కాబోతోంది. ఇక నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
EXCLUSIVE From the Set of #Jawaan @Actorvijay 🔥💥😳⏳ #Varisu pic.twitter.com/mrXuYkYzUa
— #VARISU (@VarisMovOffl) August 24, 2022
మరొక షాకింగ్ విషయం ఏమిటంటే విజయ్ ఒక బాలీవుడ్ హీరో తో కనిపించడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. వారసుడు సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. అలాగే అక్కడ షారుక్ ఖాన్ జవాన్ సినిమా మొదటి షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ క్రమంలో జవాన్ డైరెక్టర్ అట్లీ విజయ్ తో ఇది వరకే మూడు సినిమాలు చేశాడు కాబట్టే ప్రత్యేకంగా అట్లీ సెట్ లోకి కూడా వెళ్లడం జరిగిందట.
అయితే అక్కడ షారుక్ ఖాన్ విజయ్ పక్కపక్కనే కూర్చుని కొంతసేపటి వరకు మాట్లాడుకున్నారు. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరు వర్గాల అభిమానులు కూడా ఈ ఫోటోను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా షేర్ చేసుకుంటున్నారు. తప్పకుండా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ బ్లాస్ట్ అవుతుంది అని కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక మరోవైపు విజయ్ వారసుడు సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ కూడా లీకైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఎడిటింగ్ రూమ్ లో నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
#Varisu Song Exclusive ❤️ @actorvijay pic.twitter.com/p0XsGYPe3l
— Varisu Trends (@Varisu_Offl) August 24, 2022