నేను అక్కడే చనిపోతా.. షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
మహారాష్ట్ర మాజీ మంత్రి , ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యతో బాలీవుడ్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ హత్య తమ పనేనని కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. కృష్ణ జింకలను వేటాడినందుకు ప్రతీకారంగా ఈ గ్యాంగ్ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్‌కు బాబా సిద్ధిఖీ అత్యంత సన్నిహితుడు. ఆయన హత్య నేపథ్యంలో సల్మాన్‌కు భద్రతను పెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో మరో బాలీవుడ్ స్టార్ తాను సెట్‌లోనే చనిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే :
దశాబ్ధాలుగా బాలీవుడ్‌ను కింగ్‌గా ఏలుతున్నారు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్, కింగ్ ఆఫ్ రొమాన్స్ ఇలా పలు పేర్లతో ఆయనను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇంతటి స్టార్‌డమ్ షారుఖ్ ఖాన్‌క రాత్రికి రాత్రే రాలేదు. ఛాన్సుల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు.. ముంబైలో నిలువ నీడ లేక బీచ్‌లో పడుకున్న రోజులూ ఉన్నాయి. పలు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలతో పాటు లైట్ మెన్‌గానూ పనిచేశాడు షారుఖ్.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సెకండ్ హీరోగా, ప్రతినాయకుడిగా ఇలా ఏ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ దశలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్- కాజోల్ జంటగా నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. నాటి నుంచి ఆయన వెనుదిరిగి చూడకుండా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో బాలీవుడ్‌కి, భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా మారారు.
గౌరీ ఖాన్‌ను ప్రేమించిన ఆయన తన పెళ్లిని హిందూ సాంప్రదాయంలో చేసుకున్నారు. తన ఇంట్లో హిందూ, ముస్లిం ఆచారాలను, అన్ని పండుగలను నిర్వహిస్తూ అన్ని మతాలు తనకు సమానమేనని చాటి చెబుతున్నారు. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ , ఇతర వ్యాపారాల ద్వారా ప్రతి ఏడాది వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు షారుఖ్. భారత్‌లో అత్యంత సంపన్నులైన సినీ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు. 60కి దగ్గరవుతున్నా నేటికీ అదే ఎనర్జీతో కుర్ర హీరోలకే పోటీనిస్తున్నారు కింగ్ ఖాన్.
అలాంటి షారుఖ్ ఖాన్ ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం తాను నటుడిగానే ఉంటానని, సినిమా సెట్‌లోనే తాను కన్నుమూయాలని.. ఇదే తన కోరిక అన్నారు షారుఖ్. స్టార్‌డమ్ వల్లే అభిమానులు, గుర్తింపు, డబ్బు లభించాయని అందుచేత స్టార్‌డమ్‌ను గౌరవిస్తానని చెప్పారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను షారుఖ్‌ను లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం వరించింది.


Click it and Unblock the Notifications











