బొమ్మరిల్లు దర్శకుడితో అఖిల్.. గీత ఆర్ట్స్ బ్యానర్‌లో!
అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలతో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం నుంచి అఖిల్ కు నిరాశే ఎదురవుతోంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మూడూ వరుసగా నిరాశపరిచాయి. దీనితో అఖిల్ తొలి విజయం మరోమారు వాయిదా పడ్డట్లు అయింది. వెంకీ అట్లూరి దర్శత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం మిస్టర్ మజ్నుపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ విడుదలయ్యాక ఆ చిత్రం నిరాశపరిచింది.
ఇక అఖిల్ నాల్గవ చిత్రానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ లోలోపల అఖిల్ 4వ చిత్రం కోసం అన్ని కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర ప్రచారం ప్రకారం అఖిల్ బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శత్వంలో నటించబోతున్నట్లు వినికిడి. బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా ఇటీవల సరైన విజయాలు లేవు.

ఒంగోలు గిత్త చిత్రం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తెలుగులో మరో చిత్రం చేయలేదు. ప్రస్తుతం అఖిల్ కోసం ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా తన తదుపరి చిత్రం గురించి అఖిల్ ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











