Syed Sohel: సింపథీ వర్కౌట్.. ఊపందుకొన్న బూట్‌కట్ బాలరాజు.. హీరో సోహైల్‌ ఏమన్నాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ గా వచ్చి.. అద్భుతమైన ఆట తీరుతో అందరి మనసులు గెలుచుకున్న సోహెల్ గురించి అందరికీ తెలిసిందే. అరియానాతో ఆయన పెట్టుకున్న క్యూట్ గొడవలే ఆనయకు మరింత క్రేజ్ తీసుకు వచ్చాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆయన అనేక సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఈయన బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈక్రమంలోనే సినిమాను ఎక్కువగా ఎవరూ చూడకపోవడంతో ఆయన ఏడుస్తూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆయన చేసిన ఆ రచ్చే ఆయనకు ప్లస్ గా మారింది. ఆ పూర్తి వివరాలు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సోహెల్ హీరోగా చేసిన బూట్‌కట్ బాలరాజు సినిమాను శుక్రవారం రోజు అంటే ఫిబ్రవరి 2వ తేదీ రోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. కానీ ఈ సినిమాకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు సోహెల్. ముఖ్యంగా నిన్న ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడాలని థియేటర్ కు వెళ్లిన ఆయనకు అక్కడ ఎక్కువ మంది కనిపించలేదు. దీంతో చాలా ఎమోషనల్ అయిపోయారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వస్తే ఆదిరించే వాళ్లే లేరని వాపోయారు.

Bootcut Balaraju Movie Hero Syed Sohel Shared Video Goes Viral Check Details

బిగ్ బాస్ లో ఉండగా.. సోహెల్, సోహెల్ అంటూ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని.. దండం పెడతాను వచ్చి సినిమా చూడాలని ప్రాధేయ పడ్డారు. ఓ హీరో తన సినిమాను చూడమంటూ ఏడుస్తూ వీడియో చేయడంతో అది కాస్తా నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. దీంతో చాలా మంది సోహెల్ అభిమానులు ఈ వీడియోపై స్పందించారు. కొందరు నెగిటివ్ గా, కొందరు పాజిటివ్ గా మాట్లాడారు. ఇదంతా ఎలా ఉన్నా.. సోహెల్ ఏడుస్తూ కనిపించడంతో చాలా మంది వెళ్లి ఆయన సినిమాను చూశారట.

తెలంగాణలో ఆయన సినిమా బాగానే ఆడుతుండగా.. ఏపీ, రాయలసీమలో ఎక్కువగా శుక్రవారం రోజు నడవేలదట. కానీ ఆయన నిన్న రాత్రి ఏడవడం.. ఈరోజు వీడియో వైరల్ అవడంతో.. తాజాగా ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ఏపీ, రాయలసీమ థియేటర్ల డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేసి.. ఏం చేశావో తెలియదు కానీ సినిమాకు పికప్ వచ్చిందని అన్నారట. అది విన్న ఆయన సంతోషంతో ఓ వీడియో చేశారు. దాన్ని ఆయన ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేశారు. తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పారు. మీ సపోర్ట్ వల్లే ఇప్పుడే సినిమా కాస్తు పుంజుకుంటుందని అన్నారు.

Bootcut Balaraju Movie Hero Syed Sohel Shared Video Goes Viral Check Details

అలాగే ఇప్పటి వరకు బూట్ కట్ బాలరాజు సినిమా చూడని వాళ్లు.. స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను తీసుకు వెళ్లి సినిమా చూడాలని కోరారు. ప్రస్తుతం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. తాను నిన్న అలా ఎమోషనల్ అవ్వడం చాలా ప్లస్ అయిందని అన్నారు. సోహెల్ షేర్ చేసిన ఈ వీడియోపై కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సింపథీ కోసమే అలా చేశావా అని కొందరు... ఏడుస్తూ నెగ్గుకొస్తున్నావు కదా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో కంగ్రాట్స్ చెబుతూ సపోర్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X