twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ సినిమా వాళ్ల సొంతం: BB3కి ఊహించని రెస్పాన్స్.. నటసింహా కెరీర్‌లో ఫస్ట్ టైమ్

    |

    నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా.. మిగిలిన దానిని కూడా అతి త్వరలోనే ప్రారంభించి.. వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో పాటు బిజినెస్‌ను కూడా ప్రారంభించారు. దీంతో మూడు ప్రాంతాల రైట్స్ అమ్ముడు పోయాయి.

    'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత వస్తున్న ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేజిక్కించుకున్నారని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందుకోసం ఆయన రూ. 15 కోట్లు వెచ్చించారని అన్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. BB3 ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కులను వారాహీ చలన చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి రూ. 35 కోట్లకు కొనుగోలు చేశారట. అలాగే, సీడెడ్ హక్కులను బల్లారి శ్రీను రూ. 12 కోట్లకు కొన్నారని సమాచారం. ఈ మూడు ప్రాంతాలకే రూ. 60 కోట్లు వచ్చాయి. బాలయ్య కెరీర్‌లో ఇదే అత్యధిక బిజినెస్ అని తెలుస్తోంది.

    Boyapati - Balakrishna Movie Andhra, Ceeded and Nizam Rights Sold Out

    నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, పవర్‌ఫుల్ రైతు పాత్రలోనూ ఆయన కనిపించనున్నాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తుండగా.. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను చేస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'మోనార్క్', 'ధర్మ' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చనున్నాడు.

    English summary
    Nandamuri Balakrishna, who is now busy with KS Ravi Kumar’s next film (NBK 105), has announced his upcoming movie tentatively titled NBK 106, which is going to be his third combo with director Boyapati Srinu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X