బోయపాటి - బన్నీ పక్కా ప్లాన్ తోనే.. మొదలయ్యేది ఎప్పుడంటే?
అల్లు అర్జున్ కెరీర్ లో మొదటిసారి పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా మార్కెట్ ను టచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ఆ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మొదటి భాగం రిలీజ్ అయ్యే లోపు ఐకాన్ ను ఫినిష్ చేయాలని బన్నీ జెట్ స్పీడ్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు.
దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ అయితే ఎప్పుడో రెడీ చేసుకున్నాడు. తప్పకుండా సినిమా అంచనాలను అందుకుంటుందని బన్నీ నమ్ముతున్నాడు. ఆ తరువాత పుష్ప 2ను కూడా రెడీ చేయబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇక బోయపాటి శ్రీను సినిమాను కూడా లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే మొదలు పెట్టాలని చూస్తున్నారు.

ఇదివరకే వీరి కాంబినేషన్ లో సరైనోడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి అంతకుమించి అనేలా మరో ఊర మాస్ సినిమాతో సిద్ధమవ్వాలని చూస్తున్నారు. అఖండ సినిమా అనంతరం బోయపాటి పూర్తి స్క్రిప్ట్ ప్లాన్ రెడీ చేసుకొనున్నాడు. ఇక ఆ లోపు బన్నీ పుష్ప 2ను రెడీ చేసి ఉంచుతాడు. అనంతరం 2022 ఏప్రిల్ లో బోయపాటి కొత్త సినిమా సెట్స్ పైకి రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











