బోయపాటికి మరో గాయం.. బాలయ్య కోసం భరించక తప్పట్లేదు?
టాలీవుడ్ హిట్ కాంబినేషన్ బోయపాటి శ్రీనివాస్ - నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి కమర్షియల్ హిట్స్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్ పై మాస్ ప్రేక్షకుల్లో అంచనాల డోస్ తారా స్థాయికి చేరుకుంటోంది. అయితే ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి.
లాక్ డౌన్ కారణంగా సినిమా షెడ్యూల్స్ తో పాటు మేకింగ్ లో కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో కొన్ని ఎపిసోడ్స్ ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా కనీసం సిటీ కూడా దాటలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బడ్జెట్ విషయంలో నిర్మాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి ముందుగా అనుకున్నంత బడ్జెట్ కేటాయించలేనని నిర్మాత.. దర్శకుడికి చెప్పారట.

సినిమా మొదలవ్వకముందే బడ్జెట్ ని చాలా వరకు తగ్గించడంతో బోయపాటి హార్ట్ అయ్యాడట. ఇక ఇప్పుడు విదేశాల్లో అనుకున్న భారీ షెడ్యూల్స్ ని ఇక్కడే ఎదో రకంగా సెట్స్ వేసి మ్యానేజ్ చేయాలని అనుకున్నాడట. కానీ నిర్మాత అందుకు సిద్ధంగా లేకపోవడంతో బోయపాటికి మరో గాయం తగిలినట్టయ్యింది. దీంతో చేసేదేమీ లేక బాలయ్య కోసం సినిమాను ఫినిష్ చేయాలని దర్శకుడు బావిస్తున్నారట.


Click it and Unblock the Notifications











