For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  #BoycottShahRukhKhan.. ఇమ్రాన్ ఖాన్‌కు సపోర్ట్.. దావూద్‌కు బ్లాక్ మనీ అంటూ నెటిజన్ల ధ్వజం

  |

  బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత పరిస్థితులు అంతా అగమ్య గోచరంగా మారాయి. బడా నిర్మాతలను, హీరోలను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఖాన్ హీరోలపై హిందూ వర్గాలు ధ్వజం ఎత్తుతున్నారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ల తీరును ఎండగడుతున్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ చేస్తున్నారు. అయితే షారుక్ ఖాన్‌ను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ ఎందుకు వచ్చిందంటే...

  Pavani Ash: అదిరే అందాలతో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ ..వీపు అందాలతో విరహపు వల!

  వరుస ఫ్లాపులతో షారుక్ ఖాన్

  వరుస ఫ్లాపులతో షారుక్ ఖాన్

  ఇటీవల కాలంలో షారుక్ ఖాన్ కెరీర్ పరంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత మూడేళ్లుగా తన సినిమా సెట్స్‌పైకి వెళ్లిన దాఖలాలు, రిలీజ్ అయిన సందర్భాలు కరువైపోయాయి. వరుస ఫ్లాపులతో సతమతవుతున్న కింగ్ ఖాన్ ఇప్పుడు ఆశగా హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టి ఇండస్ట్రీలో తన పూర్వవైభవాన్ని చాటుకోవాలని షారుక్ ఖాన్ చూస్తున్నాడు.

  Anchor Manjusha: ఉల్లిపోర లాంటి డ్రెస్‌తో అందాల విందు.. గ్లామర్ ట్రీట్‌లో ఎక్కడ తగ్గట్లేదుగా!

  పఠాన్ చిత్రం, అట్లీ సినిమాతో

  పఠాన్ చిత్రం, అట్లీ సినిమాతో

  బాలీవుడ్‌లో తన స్టార్ స్టేటస్‌ను తిరిగి అందుకోవడానికి ప్రస్తుతం పఠాన్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. పఠాన్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లోని అందమైన ప్రదేశాల్లో జరుగుతున్నది. గూడఛారి నేపథ్యంగా థ్రిల్లర్‌ కథతో షారుక్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే దక్షిణాది దర్శకుడు అట్లీతో మరో సినిమాను చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా #BoycottShahRukhKhan అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.

  నువ్వే కావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. 40 అంటే నమ్ముతారా?

  పాకిస్థాన్‌కు అనుకూలంగా అంటూ

  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ పాకిస్థాన్ దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు. ఇమ్రాన్ ఖాన్ లాంటి వారికి మద్దతు తెలియజేస్తాడు. ఎన్నోసార్లు పాకిస్థాన్ అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తాడనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రపంచంలో బెస్ట్ 20 20 ప్లేయర్స్ పాకిస్థాన్ క్రికెటర్లే అని, వాళ్లు ఛాంపియన్స్ మాదిరిగా ఆడుతారు అంటూ షారుక్ ఖాన్ చెప్పిన ఇంటర్వ్యూను ట్యాగ్ చేసి #BoycottShahRukhKhan అని ట్రెండ్ చేస్తున్నారు. అలాగే దేశంలో అసహనం పెరిగిపోతుందని అంటూ ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా జత చేయడం గమనార్హం.

  అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

  భారతీయ సంస్కృతికి భిన్నంగా

  ఇక అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి వాళ్లు దేశ ప్రతిష్టను పెంపొందించేలా తానాజీ, పృథ్వీరాజ్ లాంటి సినిమాలు తీస్తుంటే.. షారుక్ మాత్రం అశోక చక్రవర్తి జీవితాన్ని భ్రష్టుపట్టించేలా సినిమాలు తీశాడు. ఇప్పుడు భారతీయ సంస్కృతికి భిన్నంగా పఠాన్ అనే పేరుతో సినిమా తీస్తున్నాడు. అందుకే #BoycottShahRukhKhan బ్యాన్ చేద్దాం అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  Sara Ali Khan హాట్, బికినీ ఫోటోలు.. సముద్ర తీరంలో అందాల ఆరబోత!

  దావూద్ ఇబ్రహీంకు బ్లాక్ మనీ అంటూ

  బాలీవుడ్‌లో అగ్రనటులైన ఖాన్లు దేశంలో సంపాదించిన బ్లాక్ మనీని పాకిస్థాన్‌లోకి దావూద్‌కు పంపుతున్నారు. ఆ డబ్బుతో దేశంపై దాడులు, హిందువులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలాంటి ఖాన్ హీరోలను సినీ పరిశ్రమ నుంచి వెలివేయాలి. అందుకే #BoycottShahRukhKhan ట్రెండ్ చేయాలని కొందరు నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.

  Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu

  నరేంద్రమోదీ ప్రధాని అయితే..

  అంతేకాకుండా ప్రధాని నరేంద్రమోదీపై షారుక్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఓ పోస్టు పెట్టారు. ఒకవేళ మోడీ ప్రధాని అయితే నేను దేశం విడిచి వెళ్తానని షారుక్ ఖాన్ చెప్పినట్టు ఉన్న కామెంట్‌ను ఉదహరిస్తూ.. ఇంకా దేశంలో ఎందుకు ఉంటున్నావు అంటూ నిలదీస్తున్నారు. అందుకే షారుక్ ఖాన్‌ను సినీ పరిశ్రమ నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నట్టు మరో నెటిజన్ పేర్కొన్నారు.

  English summary
  Shah Rukh Khan faces Pro Pakistan allegations In social media. Netizen demands Boycott Shah Rukh Khan trending on Twitter. They alleges that Shahrukh Khan is pro for Imran Khan, Dawood Ibrahim, Against Modi and India
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X