సమంతతో బ్రేకప్.. నన్నే క్రిమినల్‌గా చూస్తారా? నాగచైతన్య ఆవేదన
దక్షిణాదిలో టాప్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు రెండో పెళ్లి వార్త తర్వాత సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు సినీ తారలు, అలాగే కొందరు సన్నిహితులు, కొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరికొందరు ట్రోలింగ్‌తో వీడియోలు పోస్టు చేస్తున్నారు. అయితే తాజాగా రాజ్ నిడిమోరుతో సమంత వివాహం తర్వాత తమ బ్రేకప్ గురించి నాగచైతన్య చెప్పిన కొన్ని విషయాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన బ్రేకప్ గురించి నాగచైతన్య చెప్పిన విషయాలు ఆసక్తిని పెంచాయి. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే?
నా లైఫ్‌లోనే కాకుండా మ్యారేజ్ బ్రేకప్ అనేది చాలా మంది లైఫ్‌లో జరుగుతుంది. నన్నే ఎందుకు క్రిమినల్‌గా చూస్తున్నారు. నా లైఫ్ గురించి ప్రజలు పెంచుకొన్న ఫీలింగ్స్‌ను నేను చేరుకోలేకపోవచ్చు. వారిని నిరాశ పరచవచ్చు. కానీ ఓ రిలేషన్‌షిప్‌ను బ్రేక్ చేయాలంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. బ్రేకప్ వల్ల జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో నాకు చాలా బాగా తెలుసు అని నాగచైతన్య అన్నారు.

నేను ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా తల్లిదండ్రులు విడిపోయినటు వంటి ఫ్యామిలి నుంచి వచ్చిన అబ్బాయిని. ఫ్యామిలీ బ్రేకప్ అయితే ఆ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బ్రేకప్ జరగడం చాలా బ్యాడ్ ఫీలవుతుంటాను. పరస్పర అవగాహనతోనే దాంపత్య జీవితం నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చైతూ తెలిపారు.
అయితే నా మ్యారేజ్ బ్రేకప్ ఓ హెడ్‌లైన్ అయిపోయి.. ఓ టాపిక్‌గా మారింది. ఓ గాసిప్‌గా మారి.. అందరికి వినోదంగా మారింది. నా బ్రేకప్ గురించి ఏదైనా మాట్లాడితే.. దాని నుంచి ఇంకా కొన్ని స్టోరిలు రాస్తారు. మరికొన్ని ఆర్టికల్స్ పుడుతాయి. వాటికి పుల్‌స్టాప్ అంటూ లేదు. నా లైఫ్‌పై ఫోకస్ పెట్టడం, నెగిటివిటీని పెంపొందించడం కంటే.. మీ లైఫ్‌పైన దృష్టి పెట్టండి. నాపై దుష్ప్రచారం ఆపేసి పాజిటివ్ వేలో థింక్ చేయండి అని నాగచైతన్య తన గత ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తన ఇంటర్వ్యూలో నాగచైతన్య చెప్పిన విషయాలను నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. చైతూ గొప్పతనానికి, హుందాతనానికి సూచిక. ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసిన విధానం చూస్తే.. సింపతి గ్రాబ్ చేయడం కాకుండా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. చైతూలోని సున్నితత్వాన్ని మరోసారి ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











