మంచు విష్ణుకు క్షమాపణలు చెప్పారు.. ఏం జరిగిందంటే?
టాలీవుడ్ హీరో మంచు విష్ణకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థ క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశం అయింది. ఈ తెలుగు స్టార్‌ను క్షమాపణలు కోరేంత తప్పు ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే మీకు అసలు విషయం అర్థమవుతుంది.
ఇటీవల ఈ సంస్థకు చెందిన విమానంలో మంచు విష్ణు వెనిస్ వెళ్లారు. ఆయన ప్రయాణించిన విమానం లండన్ మీదుగా వెనిస్ వెళ్లింది. అయితే సిబ్బంది అతడి లగేజిని లండన్లోనే దించేశారు. దీంతో వెనిస్‌లో దిగిన వెంటనే ఆగ్రహంతో విష్ను ట్వీట్ చేశారు.
మీరు ఈ ఘనకార్యం చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూనే... ఇంగ్లీషులో బూతులు సంధించారు. దీంతో వెంటనే బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థ అలర్ట్ అయింది. వెంటనే అతడిని క్షమాపణలు కోరుతూ రిప్లై ఇచ్చింది. వీలైనం త్వరగా మీ లగేజీ మీకు చేరేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో కూడా మంచు విష్ణు ఈ సంస్థ వల్ల ఇబ్బంది పడ్డారు.

మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే... ఆయన నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' ఏడాది మొదట్లో విడుదలైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ సినిమా తర్వాత 'ఓటర్', 'కన్నప్ప' సినిమాలకు కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











