మల్టీస్టారర్ పై బన్నీ ఇంట్రెస్ట్... అన్నీ కుదిరితే ప్రిన్స్ తో సినిమా సెట్ అయినట్టే..

టాలీవుడ్ లో మల్టీస్టారర్ ల జోరు పెరిగింది. టాప్ హీరోలందరూ చేతులు కలిపేస్తూ చక్కని వినోదాల విందు వడ్డించేస్తున్నారు. ప్రస్తుతం అందరి కళ్లూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ పైనే ఉండగా, మరోవైపు అల్లు అర్జున్ కూడా మల్టీ స్టారర్స్ పై ఆసక్తి కనబరుస్తున్నాడని తెలుస్తోంది.

మల్టీస్టారర్స్ కు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే అలాంటి సినిమాలు తెరకెక్కించగల సత్తా ఉన్న డైరెక్టర్ల కోసం బన్నీ వెతుకుతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరితే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కానీ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కానీ ఓ జబర్దస్త్ మల్టీస్టారర్ మూవీ చేయాలన్నది బన్నీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఈ మేరకు ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Bunny gears up for Multi starrers

మరోవైపు కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తెలుగులో తెరకెక్కించనున్న చిత్రంలో రామ్ చరణ్, మహేశ్ బాబు కలసి నటిస్తారన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీ ఉండగా, మహేశ్ బాబు పరుశురాం దర్శకత్వంలో సర్కారువారి పాటలో నటిస్తున్నాడు.

త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. మరి, మరోసారి బాక్సాఫీస్ వద్ద తలపడనున్న బన్నీ, ప్రిన్స్ చేతులు కలిపితే ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X