పుష్ప 2 విడుదల అయ్యేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన బన్నీ వాసు.. అందుకే ఆలస్యం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్హున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మరో ట్యాగ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కెరీర్ లోనే మొదట ఫ్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప 1 బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది. కేవలం హిందీలోనే 100కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకొని అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా రానున్న పుష్ప 2 పై అంచనాలు అయితే మామూలుగా లేవు.

తప్పకుండా సినిమా అంతకుమించిఅనేలా ఉంటుంది అని ఆడియెన్స్ లో కొన్ని అంచనాలు ఉన్నాయి. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కు సినిమా బిజినెస్ విషయంలో భారీగా టేబుల్ ప్రాఫిట్స్ అందే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు ఆ లెక్కలు 700కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

bunny vaasu clarification on pushpa 2 movie release update

ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే సినిమా విడుదల అయ్యేది ఎప్పుడు అనే విషయంలో గీత ఆర్ట్స్ కు చెందిన బన్నీ వాసు ఒక క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు వివరణ ఇచ్చారు. అసలైతే పుష్ప 2 సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటి లోపు షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి సినిమాను 2023 సమ్మర్ లోకి షిఫ్ట్ చేసినట్లు బన్నీ వాసు తెలిపారు.

ఇక అప్పుడు అయితే సినిమాకు మిగతా భాషల్లో కూడా పెద్దగా పోటీ ఉండదని నిర్మాతలు ఆలోచించారట. మరి సినిమా ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఈసారి పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ను సంప్రదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ పుష్ప రాజ్ క్యారెక్టర్ కాస్త నెగిటివ్ పాత్రలో ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X