బన్నీ వర్సెస్ దుల్కర్... ఫేషన్ ఫేస్ ఆఫ్ అట...
లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ స్టార్సు, సూపర్ స్టార్స్ అన్న తేడా లేకుండా అందరూ గడ్డాలు పెంచేశారు. సెలూన్లు తెరచుకోకపోవడంతో గత్యంతరంలేక కొంతమంది ఇంట్లోనే గుబురు గడ్డాలతో ప్రయోగాలు చేశారు. మరికొంతమంది అదీ చేయలేక చతికిల పడ్డారు. అయితే, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మల్లూవుడ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ లాక్ డౌన్ లోనూ మస్త్ హాట్ గా తయారయ్యి ఒకరికి మరొకరు ఛాలెంజ్ విసురుకున్నారు.
ఇటీవలే బన్నీ న్యూలుక్స్ తో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఉంగరాల జుట్టుతో సూపర్ హాట్ గా కనిపిస్తుూ బయట ఇలా అడుగుపెట్టాడో లేదో కెమెరా క్లిక్ మంది, ఫొటోలు హాటు కేకుల్లా వైరల్ అయ్యాయి. ఇక మల్లూవుడ్ లో దుల్కర్ కూడా ఇదేవిధంగా న్యూలుక్స్ తో జనాలను కట్టిపాడేస్తున్నారు. అయితే, వీరిద్దరి లూక్స్ కు ఫిదా అయిన ఓ బాలీవుడ్ వెబ్ సైట్ ఇద్దరి లుక్స్ పైనా ఓ పోలింగ్ నిర్వహించింది. ఎవరి కొత్త గెటప్ బాగా నచ్చింది అంటూ మొదలైన ఈ పోలింగ్ రిజల్ట్స్ కూడా జనాలను ఆశ్చర్యపరిచాయి.

నిజం చెప్పాలంటే.. బన్నీ, దుల్కర్ లుక్స్ వేటికవే భిన్నంగా ఉన్నాయి. ఇద్దరివీ యూనీక్ పర్శనాలిటీలు అని చెప్పవచ్చు. బన్నీ లుక్స్ మాస్ గా ఉండగా, దుల్కర్ లుక్ చాలా హుందాగా ఉంది. అయితే మాస్ లుక్కే అదిరింది అంటూ నెటిజెన్లు బన్నీకే పట్టం కట్టడం విశేషం. ఇటీవలే నిర్వహించిన ఈ పోలింగ్ లో అల్లు అర్జున్ కు 62శాతం ఓట్లు పోల్ అవ్వగా, దుల్కర్ కు 38శాతం ఓట్లు లభించాయి. ఏమైనా, మన స్టైలిష్ స్టార్ మరోసారి తన స్టైల్ స్టేట్మెంట్ తో వహ్వా అనిపించుకున్నాడనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











