twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi: మెగాస్టార్ చేతికి సర్జరీ.. గాడ్ ఫాదర్ షూట్ కి బ్రేక్.. అసలు ఏమైదంటే?

    |

    ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి ఆయన చేతికి ఏమైంది అని ఆయన అభిమానులు అందరూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మెగాస్టార్ చేతికి ఉన్న కట్టు వెనుక అసలు కారణం మెగాస్టార్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. అయితే చిరంజీవి చేతికి ఏమైంది అనే వివరాల్లోకి వెళితే

    అభిమానులు అండగా

    అభిమానులు అండగా


    సేవ అంటే ముందుండే మెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా ఎంతోమందిని ఆదుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలి అనుకుంటున్న సమయంలో ఆయన ప్రతి జిల్లాలో ఉన్న చిరంజీవి అభిమానుల సహాయ సహకారాలు తీసుకోవాలని భావించారు.

    అభిమానుల టెన్షన్

    అభిమానుల టెన్షన్

    ఆయన భావించినట్లుగా చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కోసం పని చేసి ఎన్నో వందల ప్రాణాలు కాపాడారు. ఈ క్రమంలో చిరంజీవి ఆదివారం నాడు తెలంగాణ నుంచి ప్రతి జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకుల కోసం పనిచేసిన వారందరినీ ప్రత్యేకంగా అభినందించారు.. ఆదివారం నాడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి స్వయంగా పాల్గొని వారందరితో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ సమయంలో చిరంజీవి చేతికి పెద్ద కట్టుకట్టి ఉండడంతో ఏమైందో అని అభిమానులు టెన్షన్ పడ్డారు.
    అయితే ఈ సందర్భంగా చిరంజీవి తన చేతికి చిన్నపాటి సర్జరీ అయింది అనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తన కుడి చేత్తో ఏ పని చేస్తున్నా నొప్పిగా ఉండటం అలాగే తిమ్మిరి వస్తున్నట్లుగా అనిపించడంతో డాక్టర్ను సంప్రదించానని ఆ సమయంలో తన చేతికి ఏమైంది అనే విషయాన్ని డాక్టర్ వెల్లడించారని ఆయన పేర్కొన్నారు.

    కార్పల్ టన్నెల్ సిండ్రోమ్

    కార్పల్ టన్నెల్ సిండ్రోమ్

    తనకు ఎన్నో సూపర్ హిట్ సినిమాకు అందించిన దర్శకుడు విజయబాపినీడు అల్లుడు, కాస్మొటిక్ సర్జన్ సుధాకర్ రెడ్డి తనకు చాలా కాలంగా పరిచయం ఉండడంతో ఆయనను సంప్రదిస్తే తన కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్(median nerve) అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్(carpal tunnel syndrome) అంటారని సుధాకర్ రెడ్డి వెల్లడించినట్లు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు

     మళ్లీ కుడి చెయ్యి యధావిధిగా

    మళ్లీ కుడి చెయ్యి యధావిధిగా


    సర్జరీ చేసిన 15 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే మళ్లీ కుడి చెయ్యి యధావిధిగా పనిచేస్తుందని సుధాకర్ రెడ్డి చెప్పడంతో వెంటనే సర్జరీ చేయించుకున్నానని అపోలో హాస్పిటల్స్ లోనే ఈ సర్జరీ జరిగిందని చిరంజీవి పేర్కొన్నారు.. ఇక అప్పటికే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో ఉండడంతో ఒక ఫైట్ సీక్వెన్స్ ముందే పూర్తి చేసి ఆ తర్వాత షూటింగ్ గ్యాప్ తీసుకున్నామని ఆయన వెల్లడించారు. 15 రోజుల గ్యాప్ తీసుకున్న తర్వాత నవంబర్ ఒకటో తారీకు నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు మెగాస్టార్ వెల్లడించారు.

    Recommended Video

    Actress Sree Leela Exclusive Interview Part 2 | Pelli SandaD
    శరీరాన్ని ఇంతలా కష్టపెడుతున్నారు

    శరీరాన్ని ఇంతలా కష్టపెడుతున్నారు

    ఇక శరీరాన్ని ఇంతలా కష్టపెడుతున్నారు కాబట్టి ఒకసారి ఇలా జరగడం కామన్ అని డాక్టర్లు చెప్పారు అని అయితే ఇక మీదట మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని కూడా డాక్టర్లు తమ దృష్టికి తీసుకువచ్చారని మెగాస్టార్ పేర్కొన్నారు. మీ అందరి ఆశీస్సులతో తాను త్వరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కోలుకున్నానని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీ తర్వాత ఇప్పుడు కుడి చేతికి ఎలాంటి సమస్యలు లేనట్లు అనిపిస్తోందని 15 రోజుల తర్వాత ఎలాంటి కట్టు లేకుండానే అది సెట్ అయిపోతుంది అని డాక్టర్లు చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు. దీంతో టెన్షన్ పడిన మెగాస్టార్ అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    English summary
    megastar chiranjeevi revealed that he underwent carpal tunnel syndrome surgery.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X