Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ముచ్చటగా మూడు షేడ్స్ చూపిస్తానంటోన్న అక్కినేని కుర్రాడు
ఈ ఏడాది బోణీకొట్టకుండానే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన నాగచైతన్య, ఇందులో నుంచి బయపడుతూనే చకచకా సినిమాలు చేసేయాలని ఎదురుచూస్తున్నాడు. అన్నీ బాగుంటే ఈపాటికి అబ్బాయి లవ్ స్టోరీ జనాలు మురిపించి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ముచ్చట కూడా లాక్ డౌన్ పూర్తయ్యేవరకూ వాయిదా పడిపోయింది.
ఈ గ్యాప్ లో చక్కగా ముద్దుల భార్య సమంతతో క్వీలిటీ టైమ్ గడుపుతున్న చై, ఇటీవలే బావ రానా పెళ్లివేడుకలో సందడి చేసి ఫ్యాన్స్ ను అలరించాడు. మరోవైపు వర్క్ పరంగానూ యాక్టివ్ గానే ఉన్న చై, కథలు వింటూ మంచి ప్రాజెక్ట్ లను లైన్ అప్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మనం డైరెక్టర్ తో మనోడు మరోసారి చేతులు కలపబోతున్నాడు.
మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ చైతన్యకు ఓ కథ వినిపించడం, దానికి చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయి. థాంక్యూ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోందనే చెప్పాలి. ఎందుకంటే, స్టార్ ప్రొడ్యూసర్ రాజుగారు దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి, సినిమా ఆషామాషీగా ఉండబోతని అర్ధమవుతోంది.
ఇక ఈ సినిమాలో చైతన్య మూడు పవర్ ఫుల్ అవతారాల్లో కనువిందు చేయబోతున్నాడట. ఇంతకు ముందెన్నడూ చూడని గెటప్ లో అబ్బాయి దర్శనమివ్వబోతున్నాడట. ప్రేమమ్ లో స్కూల్ బాయ్ గా, కాలేజీ అబ్బాయిగా, చెఫ్ గా కనిపించిన చై, థాంక్యూలో మరో మూడు విభిన్న అవతారాల్లో అలరించబోతున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రంలో చైకు సరైన జోడీ కోసం వెతుకుతున్నారు.
దర్శకుడు విక్రమ్ కుమార్ సైతం ఈ మేరకు ఓ స్టేట్మెంట్ ను విడుదల చేశారు. నాగచైతన్య, దిల్ రాజుతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వెల్లడించిన విక్రమ్, ఇదొక కుటుంబ కథా చిత్రమని వెల్లడించారు. సినిమా కథ రెండు లీడ్ క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుందని తెలిపారు. పరిస్థితులు అనుకూలించగానే షూటింగ్ మొదలవుతుందని స్పష్టం చేశారు.