ఎన్టీఆర్ బయోపిక్: చంద్రబాబు నాయుడు ఫస్ట్ లుక్ ఇదే.. మైమరపిస్తున్న రానా!
Recommended Video

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో దగ్గుబాటి రానా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సతీమణి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు పాత్ర ఎంత కీలకమో అందరికి తెలిసిందే.
అల్లుడిగా ఉంటూ ఎన్టీఆర్ స్థాపించిన రాజకీయ పార్టీలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు పాత్రలో నటిస్తున్న తాజా లుక్ ని తాజాగా విడుదల చేశారు. 1984 లో చంద్రబాబు నాయుడు అంటూ తాజా ట్వీట్ చేశాడు.
రానా లుక్స్, హెయిర్ స్టైల్ అన్ని అంశాల పరంగా చంద్రబాబు పాత్రలో ఒదిగిపోయాడు. ఈ ఫస్ట్ లుక్స్ చూస్తుంటే తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఎలా నటించాడు, రానా చంద్రబాబులా హావ భావాలూ ఎలా పలికించాడు అనే ఉత్కంఠ మొదలవుతోంది. నిర్మాణ వ్యయానికి వెనుకాడకుండా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి పాత్రలో మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్ నటిస్తోంది.



Click it and Unblock the Notifications











