ANR రిజెక్ట్ చేసిన ఆ పాట.. మెగాస్టార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్..

ANR - Chiranjeevi: ఏదైనా సినిమా స్టోరీ రాసేటప్పుడు మూవీ మేకర్స్ ఒక హీరోని దృష్టిలో పెట్టుకుంటారు. ఆ హీరోకు తగ్గట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్ బేస్ కు అనుగుణంగా ఆ కథను అల్లుకుంటారు. అయితే.. ఆ కథ నచ్చకపోతే లేదా ఆ హీరో డేట్ దొరకపోతేనే.. ఆ సోర్టీ మరొక హీరో చేతుల్లోకి వెళుతుంది. ఇది సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణం. అలా అనుకున్న హీరోతో కాకుండా మరో హీరోతో చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కేవలం సినిమా స్టోరీనే కాదు పాటలు కూడా మారుతుంటాయి. అలా సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర్ రావు ( ANR) రిజెక్ట్ చేసిన ఓ పాట మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) కెరీర్ లోనే మోస్ట్ ఐకానిక్ సాంగ్ మారింది.

చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరొక హీరో చేతుల్లోకి వెళ్తుంది. కేవలం సినిమా స్టోరీలో కాదు.. పాటలు కూడా మారుతుంటాయి. రచయితలు రాసిన లిరిక్స్ బాగాలేకపోయినా.. ఆ హీరో ఇమేజ్ కు తగ్గట్టు లేకపోతే.. దర్శకులు, సంగీత దర్శకులు పక్కన పెట్టేస్తుంటారు. వేరే చిత్రాల్లో వాటిని వాడుకుంటుంటారు. అలా.. అక్కినేని నాగేశ్వర రావు రిజెక్ట్ చేసిన పాటను మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పెట్టేశారంట.ఆ సాంగ్ చిరంజీవి కెరీర్ బ్లాక్ బస్టర్ ..బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ లో ఆ పాట కూడా నిలిచింది.

Chiranjeevi s abbanee teeyani debba song rejected by akkineni nageswara rao

ఆ పాట ఏదో కాదు.. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో 'అబ్బని తీయని దెబ్బ' . ఈ పాటను లెజండ్ వేటూరి సుందరరామమూర్తి గారు చాలా ఏండ్ల కిత్రమే అక్కినేని నాగేశ్వర రావు కోసం రాశారట. కానీ, వేటూరి గారు రాసిన లిరిక్స్ కాస్త అసభ్యంగా ఉన్నాయి, తన ఇమేజ్ కు సెట్ కాదని ఏఎన్నార్ రిజెక్ట్ చేశారట. అదే పాటని వేటూరి కొంచెం మార్పులు చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కోసం ఇచ్చారట.

ఇక దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం ఆ పాటకు తోడు కావడం మరో పెద్ద ప్లస్ పాయింట్. ఇళయరాజా స్వరపరిచిన అబ్బని తీయని దెబ్బ పాట ఒక ఎత్తైతే.. చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంట మరో ఎత్తు. ఆ పాటకు తగ్గట్టుగా శ్రీదేవి, చిరంజీవి వేసిన క్లాస్ అండ్ గ్లామరస్ స్టెప్పులు, అలాగే.. శ్రీదేవి గ్లామర్ కూడా హైలైట్ గా నిలిచాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఈ పాటను అద్భుతంగా పాడారు. ఈ పాట చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న పాటగా నిలిచింది.

ఎవర్ గ్రీన్ 'అబ్బని తీయని దెబ్బ' సాంగ్ గురించి అక్కినేని పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వెంకట్ మాట్లాడుతూ.. వేటూరి గారి రాసిన లిరిక్స్ అసభ్యంగా ఉన్నాయనీ, కాస్తా ఇబ్బందిగా ఉన్నాయనీ, తన ఇమేజ్ కు సెట్ కాదని నాన్నగారు రిజెక్ట్ చేశారు. అయితే.. అదే పాటను జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో యూస్ చేశారని తెలిపారు.

అలాగే.. నాగార్జున నటించిన రక్షణ సినిమా కోసం సిరివెన్నెల రాసిన 'నీకు నాకు ఉన్న లింక్ ' అనే పాటని మొదట విలన్ పై షూట్ చేయాలని భావిస్తే.. ఆ పాట బాగుందనీ, తనకి ఇచ్చేయమని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అడిగిన సంగతిని కూడా అక్కినేని వెంకట్ గుర్తు చేసుకున్నారు. కానీ, చివరికి పాటను రక్షణ చిత్రంలోనే నాగార్జున, సిల్క్ స్మితపై షూట్ చేశారు. ఇలా ఒక హీరో రిజెస్ట్ చేసిన పాటలు, స్టోరీలు మరో హీరో కెరీర్ లో హిట్స్ గా మారిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X