నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి

By Bojja Kumar

Recommended Video

Chiranjeevi Speech About Geetha Govindam Movie Unofficial Release

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా పరశురాం దర్శకత్వంలో న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'గీత గోవిందం' పైరసీ గురించి ప్రస్తావించారు. సినిమా విడుదల ముందు ఈ చిత్రాన్ని కొందరు టెక్నీషియన్స్ దొంగిలించి తమ స్నేహితులతో పంచుకోవడం, రిలీజ్ ముందే సినిమా లీక్ కావడంతో నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పలువురిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే.

మాన‌సికంగా డిస్ట‌ర్బ్ అయి కనిపించారు

మాన‌సికంగా డిస్ట‌ర్బ్ అయి కనిపించారు

కొన్నాళ్ల క్రితం అర‌వింద్‌గారిని క‌లిసిన‌ప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడిగినపుడు ఆయన చాలా టెన్షన్ తో ఉన్నారు. ఏం జరిగింది అంటే కంటెంట్ మొత్తం బయటకు వెళ్లిపోయింది. దాదాపు గంట‌న్న‌ర సినిమా లీక్ అయింద‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ఆయన మాన‌సికంగా డిస్ట‌ర్బ్ అయి కనిపించారు.

 నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలాగే అయిందని ధైర్యం చెప్పా

నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలాగే అయిందని ధైర్యం చెప్పా

అపుడు వారితో ఒకటే మాట అన్నాను. `మీరేం వ‌ర్రీ కాకండీ. మా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా `అత్తారింటికి దారేది` కూడా ఇలాగే గంట‌న్న‌ర కంటెంట్ బ‌య‌టికి వెళ్లిపోయింది. దాని వ‌ల్ల స‌క్సెస్‌కి ఏమాత్రం ఆటంకం లేదు. ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది అంత పెద్ద హిట్ అవుతుంది. ఆ ర‌కంగా సెంటిమెంట్ అనుకోండి` అని ఆయనకు ఊరట కలిగించడానికి అన్నాను.

ఇదేం న్యాయం?

ఇదేం న్యాయం?

ఇన్ని కోట్లు వెచ్చించి సినిమా చేసిన త‌ర్వాత ఆ కంటెంట్‌ని ఏదో కుర్ర‌త‌నంగానో, వేరే దురుద్దేశాలు ఉండో.. దాన్ని య‌థాలాపంగా త‌స్క‌రించి, చోరీ చేసి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవ‌డం ఏం న్యాయం? ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు? అని చిరంజీవి ప్రశ్నించారు.

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే

సినిమా ప‌రిశ్ర‌మ వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాది కలిగిస్తోంది. ఇక్కడికి వచ్చిన అందరికీ త‌ల్లిలాగా అన్నంపెట్టే పరిశ్రమ ఇది. ఇక్క‌డ ప‌నిచేసే టెక్నీషియ‌న్స్ దాన్ని దొంగిలించి వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేయడం ద్రోహం చేయడమే. అలాంటి వారు త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దేర‌కాలు.. వారు ఈ విషయాన్ని గ్రహించాలి.

 మీ తల్లిదండ్రులను బాధించవద్దు

మీ తల్లిదండ్రులను బాధించవద్దు

త‌ప్పు చేసిన వారు జైల్లో ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు. మీకు ఈ దుస్థితి కావాలా? ఇలాంటి పనులు చేసి మీ త‌ల్లిదండ్రుల‌కు ఆవేదన, బాధ కలిగించడం అవసరమా? ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ హెచ్చ‌రిస్తున్నాను. కింది స్థాయి టెక్నీషియ‌న్స్ నుంచి ఎవ‌రైనా బాధ్య‌తా ర‌హితంగా బిహేవ్ చేస్తే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన‌ట్టేన‌ని అర్థం చేసుకోండి. ఇలాంటి చెడ్డ పనులకు పాల్పడవద్దని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను... అని చిరంజీవి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X