twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరే నా దృష్టిలో హీరోలు.. పవన్ నటించిన ఏ సినిమా ఇష్టమంటే.. చిరంజీవి

    |

    Recommended Video

    Chiranjeevi Speech At Sye Raa Narasimha Reddy Success Meet | మహేష్ బాబు,రాజమౌళి కి చాలా నచ్చింది!!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి చిత్రం విడుదలై సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. రూ.300 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం తొలిరోజే రూ.100 కోట్లు దాటింది. అయితే ఈ సినిమాకు ముందు డైలీ హంట్, తెలుగు వన్ ఇండియా, తెలుగు ఫిల్మీబీట్‌కు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు వెల్లడించారు. చిరంజీవి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    రాంచరణ్‌కు ఎన్ని మార్కులు వేస్తానంటే..

    రాంచరణ్‌కు ఎన్ని మార్కులు వేస్తానంటే..

    నా కుమారుడిగా, నిర్మాతగా, నటుడిగా 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తానంటే.. తండిగా రాంచరణ్‌కు 10/10 ఇస్తాను. ఎందుకంటే ఫిల్మీస్టార్‌గా నా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ మార్కులు ఇస్తాను. ఇక హీరోగా రాంచరణ్‌కు 10/10 ఇస్తాను. రంగస్థలం సినిమా విషయంలో చెర్రీ చూపిన ప్రతిభ అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో పూర్తిస్థాయి నటుడు (కంప్లీట్ యాక్టర్) అయ్యారు అని గర్వంగా చిరు చెప్పారు.

    నిర్మాతగా రాంచరణ్

    నిర్మాతగా రాంచరణ్

    ఇక సైరా నిర్మాతగా రాంచరణ్‌కు 10/10 మార్కులు వేస్తాను. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను, భారీ బడ్జెట్ చిత్రాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేశారు. నా కెరీర్‌లో భారీగా బడ్జెట్ పెట్టి సినిమా తీసిన వారిలో రాంచరణ్ టాప్. దాదాపు 300 కోట్లతో సినిమాను రూపొందించాడు. నా కలను సాకారం చేశాడు అని మెగాస్టార్ పేర్కొన్నారు.

     నాకు ఇష్టమైన పవన్ నటించిన మూవీ

    నాకు ఇష్టమైన పవన్ నటించిన మూవీ

    పవర్ స్టార్, నా సోదరుడు పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా నాకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు చూశాను. ఎప్పుడు సమయం దొరికినా అప్పుడు నేను చూస్తాను. అంతగా నచ్చడానికి ఫన్ లవ్ స్టోరి, పవన్ నటన, ఫెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చుతాయి. అందుకే ఎన్నిసార్లైనా చూస్తాను అని చిరంజీవి తెలిపారు.

    సైరాలో నాకు ఇష్టమైన పాత్రలు

    సైరాలో నాకు ఇష్టమైన పాత్రలు

    సైరాలో ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి పాత్ర కాకుండా నేను చేయాలనుకొన్నది పాత్ర వీరారెడ్డి (జగపతిబాబు) పోషించిన పాత్ర. ఆ తర్వాత అవుకు రాజు (సుదీప్ కిచ్చ). ఆ రెండు క్యారెక్టర్లు నాకు బాగా నచ్చాయి. సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి అని చిరంజీవి పేర్కొన్నారు.

     నా ఫేవరేట్ హీరోలు వీరే

    నా ఫేవరేట్ హీరోలు వీరే

    నా బాల్యంలో నాకు సినీ హీరోగా స్ఫూర్తినిచ్చింది అమితాబ్ బచ్చన్. సామాజిక జీవనంలో మన జాతిపిత మహ్మత్మగాంధీని నేను హీరోగా భావిస్తాను. ఆ ఇద్దరి ప్రభావం నాపై ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వారిద్దరిని హీరోలుగా ఊహించుకొంటాను అని చిరంజీవి అన్నారు.

    English summary
    Megastar Chiranjeevi reacted on his Biopic in Sye Raa promotion with Telugu oneindia, Telugu Filmibeat, Daily Hunt app. He said that If I want give marks from out of 10 to 10 for Ram charan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X