శ్రీదేవి ఒక్కరే ఆల్ ఇండియా లేడీ సూపర్ స్టార్.. చిరంజీవి
16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జెఆర్.సీ కన్వెన్షన్ సెంటర్లో ఆట పాటలతో..తారల తళుకుబెళుకుల నడుమ అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జానకి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సంతోషం వేడుకల్లో తొలిసారి అందాల తార శ్రీదేవి పేరు మీద స్మారక అవార్డును నెలకోల్పడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించాను..గాని ఆమెతో నటించిన ఆ నాలుగు సినిమాల అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అందులోనూ జగదీక వీరుడు..అతిలోక సుందరి సినిమా ఓ మధుర జ్ఞాపకం. శ్రీదేవి కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నారో? చివరికి వరకూ అలాగే ఉన్నారు.
స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత కొందరి హీరోయిన్లలలో మార్పులొస్తాయి. కానీ శ్రీదేవి లో ఎలాంటి మార్పులు రాలేదు. డౌన్ టు ఎర్త్ గానే నడుచుకున్నారు. ఆమెను చూసి నేను కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆమెకు ఓపిక..సహనం ఎక్కువ. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యారు.
సౌత్ ఇండియాలో నెంబర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారు. నార్త్ ఇండియాలోనూ నెంబర్ వన్ హీరోయిన్లు ఉన్నారు. ఇలా నెంబర్ వన్ హీరోయిన్లు ఎంత మంది ఉన్నా శ్రీదేవి ఒక్కరే ఆల్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా కీర్తింపబడ్డారు. ఆమె అవార్డును తమన్నా అందుకోవడం సంతోషంగా ఉంది.


Click it and Unblock the Notifications











