అలాంటి వేషాలు వేయమంటే బాధపడ్డాను.. భోళా శంకర్ ఈవెంట్‌లో చిరంజీవి ఆవేదన
సినిమా పరిశ్రమలోకి చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ దేశంలోని అగ్ర నటుడి స్థాయికి చిరంజీవి ఎదిగారనే విషయం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి, ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇచ్చిన ఆయన అన్ని రకాల అవరోధాలను, అడ్డంకులను ఎదుర్కొంటూ సుదీర్ఘమైన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఆడియోలో నటుడిగా తన ప్రయాణాన్ని.. చిరంజీవి తన భావోద్వేగాలను పంచుకొంటూ..
అప్పటికే గొప్ప స్టార్స్ ఉన్న సమయంలో బిక్కుబిక్కు మంటూ ఇండస్ట్రీకి వచ్చాను. నేను టాలెంట్‌ను నమ్మకొని గట్ ఫీలింగ్‌తో వచ్చాను. కాబట్టి ఎలాంటి చిన్న వేషాలు వేయడానికి కూడా వెనుకాడలేదు. శుభలేఖ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి సినిమా చేసే సమయంలో కృష్ణ గారి పక్కన కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీలో విలన్ వేషాలు చేయమంటే బాధపడ్డాను. కానీ చేయనని చెప్పలేదు. భవిష్యత్‌పై ఏదైనా జరుగుతుందో భయపడ్డాను. కానీ నన్ను భుజానికి ఎత్తుకొని పైకి లేపింది ప్రేక్షకులే అని గట్టిగా చిరంజీవి అరిచారు.

నేను నటుడిగా ఎదుగుతున్న రోజుల్లో డిస్టిబ్యూషన్స్ ఉండేవి. కొంత మంది డిస్టిబ్యూటర్లు వచ్చి ఫలానా చిరంజీవి బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఫైట్స్ చేస్తున్నాడు. చాలా సహజంగా ఉంటున్నాయి. ప్రేక్షకులు అతడి సినిమాలు బాగా చూస్తున్నారు. అతడితో సినిమాలు చేయండి. మేము పెట్టుబడి పెడుతాం. మాకు లాభాలు రావాలి కదా నిర్మాతలకు చెప్పేవారు అని చిరంజీవి తెలిపారు.
ప్రేక్షకుల అభిమానంతోనే నిర్మాతలు నన్ను కమర్షియల్ పాత్రలను ఇచ్చారు. ప్రేక్షకులకే నేను రుణపడి ఉంటాను. వాళ్లే లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నిర్మాత, దర్శకులు నా సెకండరీ. ప్రేక్షకులే నాకు మొదటి ప్రయారిటీ అని చిరంజీవి అన్నారు.
మిల్కీ బ్యూటీ సాంగ్‌లో తమన్నా పక్కన మెరిసిపోతున్నారంటే.. అందుకు కారణం నేను తీసుకొనే డైట్, నేను చేసే ఎక్సర్‌సైజులు కాదు. కేవలం ప్రేక్షకులు ఇచ్చే ఎనర్జీ మాత్రమే. మీరు ఏం చేసినా ఆదరించడం వల్లే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ గ్లామర్, ఎనర్జీకి కారణం మీరే అనేది అక్షర సత్యం. మన అనుబంధం ఆగేది కాదు అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











