Balakrishna కోసం రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి అలా.. చక్రం తిప్పిన అల్లు అరవింద్?
నందమూరి అందగాడు బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఆయన ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం అన్ స్టాపబుల్ అనే ఒక షో చేస్తున్నారు. ఇప్పటి వరకు చూడని విధంగా ఈ సెలబ్రిటీ టాక్ షో ఉండబోతోందని ప్రచారం మొదలైంది. అయితే ఆ సంగతి పక్కన పెడితే ఏకంగా బాలకృష్ణ, చిరంజీవి- రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఈ షోలో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే

దీపావళికి
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉగాది కానుకగా రిలీజైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

రావిపూడితో
అఖండ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అయింది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మితవనుంది. పక్కా కమర్షియల్ సినిమాలు అందించడంలో రావిపూడి అందె వేసిన చేయి కావడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ సహా నందమూరి అభిమానులు మంచి అంచనాలతో ఉన్నారు.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో
ఇక 100 శాతం తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం బాలయ్య ఒక టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కోసం ఆహా టీం పెద్ద లిస్ట్ రెడీ చేశారు. టాలీవుడ్‌తో ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఈ షోకి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ముందు క్రిష్ అని ప్రచారం జరిగినా తర్వాత కాదని తేలింది.

మంచు ఫ్యామిలీతో
ఇక ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ మంచు ఫ్యామిలీతో ఉండబోతోందని అంటున్నారు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి అతిథులుగా మొదటి ఎపిసోడ్ షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. అయితే ఈ టాక్ సోనీ మరింత గ్రాండ్ గా కనిపించేలా చేయడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగడంతో పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి.
Recommended Video

చిరు విత్ రామ్ చరణ్
అల్లు అరవింద్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ లతో చర్చలు జరుపుతున్నారని వారిద్దరూ ఈ షోకు అతిథులుగా వచ్చేలాగా అల్లుఅరవింద్ చక్రం తిప్పుతున్నారు అని అంటున్నారు. నిజానికి బాలకృష్ణ చిరంజీవి మధ్య సరైన సంబంధాలు లేవని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ నిజానికి వీరిద్దరూ మంచి స్నేహితులు.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవంలో కూడా చిరంజీవి పాల్గొని బాలకృష్ణకు ఆయన తన విషెస్ అందించాడు. ఈ షోలో కూడా చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కలిసి పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. అదే గనుక జరిగితే టాపు లేచి పోవడం ఖాయం అనే చెప్పాలి


Click it and Unblock the Notifications











