నారాయణమూర్తి ఓ యోగి... సినిమాతోనే సంసారం.. పూరీకే ఝలక్ ఇచ్చాడు.. చిరంజీవి

Recommended Video

Chiranjeevi Speech At Market Lo Prajaswamyam Audio Launch Event || Filmibeat Telugu

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తాజా చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం. తాను నమ్మిన, కట్టుబడిన సిద్దాంతానికి లోబడి చిత్రాలను నిర్మిస్తున్న ఆయన తన సినిమా ఆడియో ఫంక్షన్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ..

సైరా షూటింగ్‌లో సెట్స్‌కు వచ్చి

సైరా షూటింగ్‌లో సెట్స్‌కు వచ్చి

ఇటీవల సైరా నర్సింహారెడ్డి షూటింగ్‌‌కు వచ్చి నా సినిమా ఆడియో ఫంక్షన్ రావాలని ఆహ్వానించారు. నారాయణమూర్తి సినిమాకు గెస్ట్‌గా అంటే కొంత ఆఫ్‌బీట్‌గా అనిపించింది. ఆయన చేసే ఫంక్షన్‌కు పిలవడంతో నాకు కొంత ఆశ్చర్యం కలిగింది. ఓ మిత్రుడిగా నన్ను ఆహ్వానించడం హ్యాపీగా అనిపించింది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

 నాకు ఎంత ఆనందం కలిగిందంటే

నాకు ఎంత ఆనందం కలిగిందంటే

మేము తీసే సినిమాలకు భిన్నంగా నారాయణమూర్తి తీస్తాడు. ఆయన సినిమాలు, కార్యక్రమాలు ఓ పద్దతిలో సాగిపోతుంటాయి. అలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా సంతోషం అనిపించింది. నేను ఇక్కడకు రావడం నారాయణమూర్తికి ఎంత ఆనందం వేసిందో తెలియదు గానీ.. నేను అభిమానించే మిత్రుడి సినిమాకు రావడం నాకు మాత్రం చాలా సంతోషం కలిగింది అని చిరంజీవి తెలిపారు.

 మనసుతో పెట్టి చేసే విధంగా

మనసుతో పెట్టి చేసే విధంగా

నారాయణమూర్తి ఫంక్షన్ అంటే నాకు కుటుంబ తరహా కార్యక్రమంలా అనిపిస్తుంది. చాలా పెద్ద ఫంక్షన్లకు వెళ్తుంటాం కానీ అక్కడ ఏదో కృత్రిమంగా సాగిపోతుంటుంది. కానీ నారాయణమూర్తి ఫంక్షన్ అంటే మనసుతో పెట్టి చేసే ఫంక్షన్ మాదిరిగా ఉంటుంది. కుటుంబ పరంగా జరుగుతుందనే ఫీలింగ్ కలిగింది.

మేమిద్దరం పునాదిరాళ్లులో

మేమిద్దరం పునాదిరాళ్లులో

నారాయణమూర్తితో పరిచయం నాలుగు దశాబ్దాలు. నా తొలి సినిమా పునాదిరాళ్లు సినిమాల్లో నూతన్ ప్రసాద్‌కు సహాయకుడిగా నటించాడు. ఆ సినిమా మా ఇద్దరికి తొలి సినిమా. అప్పటి నుంచి పాండి బజార్‌లో కలుసుకొనే వాళ్లం. ఇప్పటికీ మా మధ్య అదే స్నేహం కొనసాగుతుంది అని చిరంజీవి పేర్కొన్నారు.

నికార్సయిన మనస్తత్వంతో

నికార్సయిన మనస్తత్వంతో

నికార్సయిన నారాయణమూర్తి మనస్తత్వం కారణంగానే మార్కెట్లో ప్రజాస్వామ్యం ఆడియో వేడుకకు రావడం ప్రధాన కారణం. అతడి అంకితభావం, స్వచ్ఛమైన హృదయం ఉందని చెప్పడానికి గర్వంగా ఫీలవుతాను. కష్టపడే మనస్తత్వం, సినిమా అంటే ప్రేమ ఉండటం వల్లే ఈ రోజు పీపుల్స్ స్టార్‌గా ఎదిగాడు అని చిరంజీవి అన్నారు.

నమ్మిన సిద్దాంతాల కోసమే

నమ్మిన సిద్దాంతాల కోసమే

కొన్నాళ్లు సినిమా రంగంలో ఉన్న తర్వాత కమర్షియల్ సినిమావైపు ఆకర్షితులవుతారు. కానీ నారాయణమూర్తి అలాంటి వాడు కాదు. తాను నమ్మిన సిద్దాంతాల కోసమే అహర్నిశలు శ్రమిస్తాడు. కమర్షియల్‌గా కాకుండా కట్టుబడిన విలువ కోసం పాటుపడుతాడు. ఓ సారి టెంపర్ సినిమాలో నారాయణమూర్తిని ఊహించుకొని దర్శకుడు పూరీ జగన్నాథ్ కథ రాశాడు. ఆ పాత్రకు ఆయనే చేస్తే బాగుంటుందని అనుకొన్నాడు. ఆయనకు ఆఫర్ ఇస్తే కమర్షియల్ సినిమాలు చేయనని సున్నితంగా తిరస్కరించాడు. ఇది కమిట్‌మెంట్‌కు నిదర్శనం అని చిరంజీవి అన్నారు.

నారాయణమూర్తి ఓ యోగి అని

నారాయణమూర్తి ఓ యోగి అని

సినిమాల విషయాలను పక్కన పెడితే, వ్యక్తిగత జీవితం గొప్పది. రెండు సినిమాలు తీసిన తర్వాత ఎవరైనా కారు కొనుక్కోవాలనుకొంటారు. కానీ ఆయన ఎక్కడికైనా నడుచుకొంటూ వెళ్తారు. జీవితాంతం సినిమానే ప్రేమించాడు. సినిమానే పెళ్లి చేసుకొన్నాడు. సినిమాతోనే సంసారం చేస్తున్నాడు. సినిమాను అమితంగా ప్రేమించే యోగి నారాయణమూర్తి అని చిరంజీవి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X