బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ బోల్తా: చిరంజీవి మరో సంచలన నిర్ణయం.. ఏకంగా అన్ని కోట్లు రిటర్న్
టాలీవుడ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసు దాటినా కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఇప్పటికే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
ఈ క్రమంలోనే ఇటీవలే 'భోళా శంకర్' అనే చిత్రంతో వచ్చారు. కానీ, ఈ సినిమా ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఫలితంగా కోట్ల నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చిరంజీవి ఓ గొప్ప పని చేసినట్లు తాజాగా న్యూస్ లీకైంది. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

భోళా శంకర్‌గా వచ్చిన చిరు: చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం ఇచ్చాడు.

అన్ని కోట్లు నష్టాలతో షాక్: 'భోళా శంకర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, రన్ ముగిసే టైంకు దీనికి రూ. 27.20 కోట్లు వచ్చాయి. అంటే.. చిరంజీవి సినిమాకు ఏకంగా రూ. 53.30 కోట్లు మేర నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

నిర్మాతతో చిరు వివాదం: బాక్సాఫీస్ వద్ద 'భోళా శంకర్' సినిమా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవడంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలు వచ్చాయి. అదే సమయంలో ఆయనకు చిరంజీవితో విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి తనకు రావాల్సిన మొత్తం ఇచ్చేయాలని పట్టుబట్టినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారాలు జరిగాయి.

క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్: భోళా శంకర్ వివాదంపై నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ.. 'ఈ పుకార్లు కొందరికి క్రూరమైన ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ, ఎంతో కష్టపడి దక్కించుకున్న ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేయడం ఆమోదయోగ్యం కాని నేరం. ఇవి అన్ని కుటుంబాలపై తీవ్రమైన ఒత్తిడి, ఆందోళలను పెంచాయి. చిరంజీవి గారికి, నాకు మధ్య వివాదాలు వచ్చాయన్న వార్తలు పూర్తిగా అబద్ధం. ఆయన మాకు నిరంతరం చాలా మద్దతు ఇచ్చారు. ఆయన ఎప్పటిలాగానే నాతో చాలా బాగా ఉన్నారు' అని చెప్పుకొచ్చారు.

పది కోట్లు బ్యాలెన్స్ అలా: 'భోళా శంకర్' సినిమాకు గానూ చిరంజీవికి ఇచ్చే రెమ్యూనరేషన్‌లో రూ. 10 కోట్లు బ్యాలెన్స్ ఉన్న మాట నిజమేనని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఈ మొత్తాన్ని నిర్మాత అనిల్ సుంకర చెక్ రూపంలో చిరంజీవికి అందజేశారని తెలిసింది. అయితే, ఈ సినిమా పరాజయం పాలవడంతో ఆ చెక్‌ను బ్యాంక్‌లో వేయకుండా నిర్మాతకే పంపించి మెగాస్టార్ గొప్ప మనసును చాటుకున్నారట.

మరో సినిమా అవకాశం: 'భోళా శంకర్' సినిమా వల్ల అనిల్ సుంకరకు భారీ నష్టాలు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని పూడ్చేందుకు రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ వదులుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రాబోయే రోజుల్లో తక్కువ రెమ్యూనరేషన్‌తోనే మరో సినిమా చేస్తానని సదరు నిర్మాతకు హామీ కూడా ఇచ్చారని తెలిసింది. ఇది తెలిసిన వాళ్లంతా 'దటీజ్ మెగాస్టార్' అంటూ జేజేలు పలుకుతున్నారు.


Click it and Unblock the Notifications











