నాపై ఆ రాజకీయ నేత అవాకులు చెవాకులు.. వారి భార్యలే బుద్ది చెబుతారు.. చిరంజీవి ఎమోషనల్ స్పీచ్
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు హాజరై అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ఫోనిక్స్ ఫౌండేషన్ చేపట్టిన భారీ రక్తదాన కార్యక్రమానికి యువ హీరో తేజా సజ్జా, యువ హీరోయిన్ సంయుక్త మీనన్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి నా అభిమానులు లక్షలాది మంది రక్తదానం చేయడం నా పూర్వ జన్మ సుకృతం. రక్తదానం అనగానే నా పేరు స్పురించడం నేను ఎన్నో జన్మల్లో చేసుకొన్న పుణ్యఫలం అని చిరంజీవి అన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ..
ఈ రక్తదానం శిబిరం సభలో నాకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకోవాలనిపిస్తున్నది. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. నేను ఎప్పుడూ రాజకీయ నేతలకు సాఫ్ట్ టార్గెట్. ఎవరైనా నన్ను తిడుతూనే ఉంటారు. అయినా నాకు ఫర్వాలేదు అని అంటాను. అలా నాపై అవాకులు, చెవాకులు పేలిన పోలిటిషియన్‌ను ఓ మధ్య వయసు ఉన్న మహిళల గడ్డి పెట్టింది. చిరంజీవి లాంటి మనిషిని నీవు ఎలా తిడుతావు అంటూ ఓ ట్రైబల్ ఏరియాలో దూషించడం చూశాను. ఆమె సినిమా ఫ్యాన్ కాదని అనిపించింది. ఆ విషయం తెలిసి ఏం జరిగింది ఆరా తీశాను అని చిరంజీవి చెప్పారు.

చిరంజీవిపై ఎందుకు అభిమానం ప్రదర్శిస్తున్నావని ఓ జర్నలిస్టు అడిగితే.. నాకు ఆయన అంటే సినిమా అభిమానం కాదు. ఆయన వ్యక్తిత్వానికి నేను అభిమానిని అని ఆమె చెప్పినప్పుడు నా హృదయం చలించింది. నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. రాజమండ్రి ప్రాంతానికి సమీపంలోని మాకు ఆయన చేసిన సహాయం చేశాడు. మా అబ్బాయికి డెంగ్యూ వ్యాధి వస్తే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్లేట్ లేట్స్ కౌంట్ దారుణంగా పడిపోయి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది అని చిరంజీవి చెప్పారు.
అప్పుడు కొందరు చిరంజీవికి ఫన్ చేయమని చెబితే.. ఆయన నాకు తెలియదు. నేను ఎందుకు ఫోన్ చేయాలంటే.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వివరాలు ఇచ్చారు. దాంతో ఆమె ఫోన్ చేస్తే.. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని నా అభిమానులను ఏర్పాటు చేసి గంటల్లోనే ప్లేట్ లెట్స్ అందించి ఎనిమిదేళ్ల బాబు ప్రాణాలు కాపాడేలా చేశారు. ఆ విషయాన్ని చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సకాలంలో స్పందించకపోతే నా బిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. అలాంటి వ్యక్తిని ఇలాంటి తుచ్చ లీడర్లు ద్వేషిస్తారా? అందుకే ఆ రాజకీయ నేతను కడిగి పడేశాను అంటూ ఆమె చెప్పిన తీరు బాగా టచ్ చేసింది.
నా సన్నిహితులు, స్నేహితులు నాతో మాట్లాడుతూ.. మిమ్మల్ని సోషల్ మీడియాలో, మీడియాలో బాగా టార్గెట్ చేస్తుంటారు. మిమ్మల్ని ఎటాక్ చేస్తే మీరేం మాట్లాడరు ఎందుకు అని అడుగుతుంటారు. నేను చేసే మంచి పనులు, నేను పొందే ప్రేమ నాకు రక్షణ కవచం. అందుకే నేను ఎక్కువగా నెగిటివిటిపై స్పందించను. ఆ తర్వాత సదరు రాజకీయ నేత అవాకులు చెవాకులు పేలలేదు. వాళ్లకు కూడా మనసు ఉంటుంది. ఆయన అంతరాత్మ చెప్పకపోయినా.. ఇంట్లో ఆయన భార్య బుద్ది చెప్పదా? అని చిరంజీవి అన్నారు.
కొందరు మాటలకు సమాధానం చెప్పనక్కర్లేదు. మనం చేసే మంచే జవాబు చెబుతుంది. నా కోసం నా తమ్ముళ్లు చేసే మంచి పని నాకు రక్షణగా ఉంటుంది. ఇతర దేశాల్లో ఉండే నా అభిమానులు కూడా నా మాటలకు స్పందించి బ్లడ్ క్యాంపులను ఏర్పాటు చేస్తుంటారు. వారందరికి, నా అభిమానులకు ధన్యవాదాలు అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











