Chiranjeevi జాన్వీ కపూర్‌తో రామ్ చరణ్ అలా చేయాలని నా కోరిక : చిరంజీవి
మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎంత వినయుడో, విదేయుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా, గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే రామ్ చరణ్ విషయంలో చిరంజీవికి ఓ కోరిక ఉందట. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి రామ్ చరణ్ అలాంటి సినిమా చేయాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
శంకర్ గేమ్ ఛేంజర్ తో...
రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీలో మరోసారి చరణ్ సరసన కియారా అడ్వానీ నటిస్తుంది. ఇప్పటికే వీరి కాంబోలో వినయ విధేయ రామ చిత్రం వచ్చింది. ఇక ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా కుదిరింది. భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో గేమ్ ఛేంజర్ సినిమాను కొనుగోలు చేసింది.

పెద్దిగా రామ్ చరణ్...
ఆ విషయం పక్కన పెడితే.. రామ్ చరణ్ తన 16వ సినిమా ప్రారంభోత్సవం తాజాగా జరిగింది. ఇక ఈ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, జాన్వీ కపూర్, సుకుమార్, ఏఆర్ రెహమాన్, దర్శకుడు శంకర్, చిరంజీవి తదితరులు వచ్చి సందడి చేశారు. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పేరు పెద్ది అని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
చిరంజీవి వీడియో వైరల్...
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఖైదీ నంబర్ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక కొణిదెలతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ఇంటర్వూలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు. ఇక నిహారిక ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్, మెగా స్టార్ చిరంజీవిని పలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగింది. ఇప్పుడు అందులోని కొన్ని సెకన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
గ్యాంగ్ లీడర్ సినిమా..
ఆ వీడియోలో... డాడీది ఏదైనా వన్ మూవీ నువ్వు రీమేక్ చేయాలంటే ఏది చేస్తావ్ అని నిహారిక.. రామ్ చరణ్ ను అడుగుతుంది. దానికి రామ్ చరణ్ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ అని చెబుతాడు. ఇక చిరంజీవి కలుగుజేసుకుని నేను చెప్పాలా అని అడుగుతాడు. ఏంటి డాడీ అని నిహారిక అంటే.. చరణ్ జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చరణ్ రీమేక్ చేయాలి అంటూ చెప్పుకువస్తాడు చిరంజీవి. ఇది నా కోరిక అంటూ తన మనసులోని మాటను బయటపెడుతాడు.
శ్రీదేవి కూతురితో...
ఇక ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు చేయాలని నిహారిక అని అడిగితే.. శ్రీదేవి కూతురు ఉంది కదా అని చిరంజీవి చెప్పి నవ్వుతాడు. ఇక చిరంజీవి చెప్పిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. చిరంజీవి చెప్పినట్లుగానే చరణ్.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీమేక్ చేయాలని... అందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఉంటే.. నెక్ట్స్ లెవెల్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నిజంగా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











