twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ చిరంజీవి... ఇచ్చిన మాట కోసం ఫ్యామిలిని వదిలి.. చార్టెట్ ఫ్లయిట్‌లో!

    |

    Recommended Video

    Directors Association Blown Away By Chranjeevi's Gesture || Filmibeat Telugu

    మెగాస్టార్ చిరంజీవి ఓసారి మాట ఇచ్చారంటే దానికి పక్కాగా కట్టుబడి ఉంటారనే విషయాన్ని అందరూ చెబుతుంటారు. తాజాగా చిరంజీవి మాటకు కట్టుబడి ఉంటారనే విషయం మరోసారి రుజువైంది. తాజాగా దాసరి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిపిన డైరెక్టర్స్ డే కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. బెంగళూరులో ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన మెగాస్టార్ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక విమానంలో రావడంపై సినీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో వెకేషన్

    ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో వెకేషన్

    వాస్తవానికి డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం చిరంజీవి హైదరాబాద్‌లోనే ఉంటారనుకొన్నారు. అయితే సైరా నర్సింహారెడ్డి సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో షూటింగ్‌ వాయిదా పడింది. ప్రస్తుతం సెట్స్ పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుండటంతో సమయం దొరికింది. దాంతో ఫ్యామిలీతో కలిసి బెంగూళురుకు సమీపంలోని హిల్ స్టేషన్‌కు విహారయాత్రకు వెళ్లారు.

     డైరెక్టర్ డే ప్రొగ్రాం కోసం చార్టెట్ ఫ్లయిట్‌లో

    డైరెక్టర్ డే ప్రొగ్రాం కోసం చార్టెట్ ఫ్లయిట్‌లో

    డైరెక్టర్ డే కార్యక్రమం తన దినసరి జాబితాలో ఉండటం వల్ల హైదరాబాద్‌కు వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం కోసం చార్టెడ్ ఫ్లయిట్ బుక్ చేసుకొన్నారు. నేరుగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు చేరుకొన్నారు. డైరెక్టర్ డే కార్యక్రమంలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొని స్వర్గీయ దాసరికి ఘనమైన నివాళుల్పరించారు.

     దాసరికి ఘన నివాళులు

    దాసరికి ఘన నివాళులు

    డైరెక్టర్ డే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మళ్లీ నేరుగా బెంగళూరుకు వెళ్లిపోయారు. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వెకేషన్‌లో భాగమయ్యారు. ఈ విషయంతో దాసరి అంటే మెగాస్టార్‌కు ఎంత ఇష్టం, గౌరవం అనేది తెలియజెప్పింది అని చిరంజీవిపై దర్శకుల సంఘం ప్రశంసలతో ముంచెత్తింది. సినీ పరిశ్రమ అంటే తనకు ఉండే గౌరవాన్ని చాటిచెప్పింది అని ప్రశంసిస్తున్నారు.

    భారీగా చిరంజీవి, రాజమౌళి విరాళం

    భారీగా చిరంజీవి, రాజమౌళి విరాళం

    తెలుగు సినీ పరిశ్రమకు గొప్పగా సేవ చేసిన కొందరు దర్శకుల పరిస్థితి దయనీయంగా ఉంది. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక భారంతో చితికిపోయిన దర్శకుల కోసం రూ.5 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలన్నది నా ఆలోచన. అందుకు రాజమౌళి ముందుకు వచ్చారు. రూ.50 లక్షల విరాళం ఇస్తాను అని ప్రకటించారు. నేను రూ.10 లక్షలు, బాహుబలి నిర్మాతలు రూ.15 లక్షలు అందజేస్తాం. ఆర్థికంగా చితికిపోయిన దర్శకుల పిల్లలను ఇద్దరిని చదివిద్దామనుకొంటున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.

    English summary
    On the eve of Popular director Dasari Narayana Rao Birthday, Telugu film Industry celebrated Directors Day. Mega star Chiranjeevi attended as chief guest for this event and he donated Rs.25 lakhs for directors association. In order to keep his word, Chiranjeevi booked a chartered flight at the last minute and flew down to Hyderabad to grace the occasion as the chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X