Just In
- 45 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లు అర్జున్ మాటలు నమ్మను.. చిరంజీవిని కంగారు పెట్టిన సైరా రిజల్ట్
సినిమా పరిశ్రమలో ఎంతటి సూపర్‌స్టార్ అయినప్పటికీ.. తన సినిమా రిలీజ్ అయిందంటే పరీక్ష రాసిన పిల్లాడిలా మారిపోతుంటారు. తన సినిమాకు సంబంధించిన రిపోర్టును తెలుసుకోవాలనే ఆలోచన రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే చిరంజీవికి ఎదురైంది. సైరా రిలీజ్ రోజున తాను ఎంత టెన్షన్‌ను అనుభవించాననే విషయాన్ని తాజాగా పాత్రికేయులతో పంచుకొన్నారు. చిరంజీవిని కంగారు పెట్టిన క్షణాలు ఎలాంటివంటే..

ప్రతీ సినిమా మాదిరిగానే
ప్రతీ సినిమా రిలీజ్ రోజున నాకు నాలుగైదు కాల్స్ ఉదయం నాలుగు గంటలకే వస్తాయి. సైరా సినిమా రిలీజ్ రోజున అలాంటి కాల్స్ కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఎలాంటి కాల్ రాకపోయే సరికి కంగారు మొదలైంది. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కాల్ చేసి.. ఫస్టాఫ్ చూశాను. సూపర్ అంటూ చెప్పాడు. సెకండాఫ్ చూసి చెబుతానన్నాడు. అయినా 5 తర్వాత కూడా కాల్ రాకపోవడం నాలో కంగారు తగ్గలేదు అని చిరంజీవి పేర్కొన్నారు.

అమెరికా, కెనడా, సీడెడ్ నుంచి
అమెరికా, కెనడా నుంచి నా ఫ్రెండ్స్ చేస్తారు. వాళ్లు చేయలేదు. ఇక సీడెడ్ నుంచి ఎన్వీ ప్రసాద్ చేస్తారు. అతను చేయలేదు. ఇలా ఎవరూ చేయకపోవడంతో సెకాండఫ్ చూసి షాక్ తిన్నారా అనే అనుమానం వచ్చింది. దాంతో నాలో టెన్షన్ పెరిగిపోయింది. ఎవరు చూస్తారా అని ఎదురు చూస్తుంటే అల్లు అర్జున్ వాయిస్ మెసేజ్ వచ్చింది.

అల్లు అర్జున్ వాయిస్ మెసేజ్
ఇక చాలా సేపటికి అల్లు అర్జున్ నుంచి ఫోన్ వాయిస్ కాల్ వచ్చింది. కృష్ణా జిల్లాలో నిర్మాత బన్నీ వాసు సినిమా చూశాడు. సూపర్బ్ రిపోర్టు.. బ్లాక్‌బస్టర్ అంటూ చెప్పిన బన్నీ మాటలు నమ్మలేదు. ఎందుకంటే నాకు మన ఇంట్లో వాళ్లు మంచిగా ఉందని చెప్పడం సహజంగాను ఉంటుందిగా అని లైట్ తీసుకొన్నాను. దాంతో మరింత టెన్షన్ పెరిగింది.

ఉదయం 5 గంటలప్రాంతంలో
సుమారు 5 గంటల ప్రాంతంలో చాలా కాల్స్, మెసేజెస్ రావడం ప్రారంభమయ్యాయి. అంతలోనే నా ఫ్రెండ్ అమెరికా నుంచి కాల్ చేశాడు. అప్పుడు ఏంది ఇంత లేటు అని అడిగితే.. ఫస్ట్ షోకు టికెట్ దొరకలేదు. అన్ని షోలు హౌస్‌ఫుల్.. అందుకే రెండో షో చూశాను అంటూ తన కష్టాలు చెప్పారు. అలా ఓ గంట గడిచే సరికి సమగ్రంగా రిపోర్ట్ రావడంతో నాకు మనసు తేలికపడింది అని చిరంజీవి చెప్పారు.