Kaikalaను ఫోనులో పలకరించిన చిరు.. చిరునవ్వుతో థమ్స్ అప్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన చిరు!

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. శనివారం నాడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి అపోలో ఆస్పత్రి నుంచి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం గురించి ఇప్పుడు అందరిలో టెన్షన్ నెలకొంది. అయితే ఆయన ఆరోగ్యం గురించి చిరంజీవి అప్డేట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

తీవ్ర అస్వస్థత

తీవ్ర అస్వస్థత

అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి శనివారం నాడు కీలక బులెటిన్ విడుదల చేసిన అపోలో వైద్యులు ఆదివారం ఉదయం కూడా స్పందించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు.

క్షేమంగా తిరిగి రావాలని

క్షేమంగా తిరిగి రావాలని

అయితే ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సైతం ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

అప్డేట్ ట్వీట్ చేశారు

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ట్వీట్ చేశారు. ట్వీట్ లో కైకాల హెల్త్ అప్డేట్ ఇచ్చిన చిరంజీవి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. 'ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలియగానే ఆయన చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయన్ని ఫోన్లో పలకరించానని ఆయన వెల్లడించారు.

థమ్స్ అప్ చూపించి

థమ్స్ అప్ చూపించి

ఆయన త్వరగా కోలుకుంటారని పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా మళ్ళీ త్వరగా ఇంటికి తిరిగి రావాలని ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థమ్స్ అప్ చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారన్నారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్ధిస్తూ ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు అందరి తోనూ ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చిరు పేర్కొన్నారు.

Recommended Video

Latest Tollywood Updates : ఇన్నేళ్లకు మళ్లీ Chiranjeevi సినిమాలో నటిస్తున్న రమ్యకృష్ణ!
ట్రాకియోటమీ అంటే

ట్రాకియోటమీ అంటే

ట్రాకియోటమీ అంటే ప్రాణము కాపాడడానికి వాయు నాళములో ఒక గంటు పెట్టుట, ఫలితంగా ఏర్పడే రంధ్రం స్వతంత్రంగా వాయుమార్గంగా లేదా a కోసం ఒక సైట్‌గా పనిచేస్తుంది. అలా చేసి ట్రాచల్ ట్యూబ్ లేదా ట్రాకియోటమీ ట్యూబ్ చొప్పిస్టార్. ఈ ట్యూబ్ ఒక వ్యక్తి ముక్కు లేదా నోటిని ఉపయోగించకుండా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఈ శస్త్రచికిత్సలో శ్వాసనాళాల సమయంలో గాలి తక్కువ శ్వాసకోశంలోకి ప్రవేశించడానికి వీలుగా శ్వాసనాళం తెరవడం మరియు దానిలో ఒక గొట్టాన్ని చొప్పించడం జరుగుతుంది. ఇది ఒక అత్యవసర ఆపరేషన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X