For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దటీజ్ చిరంజీవి : మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం ఇది.. దేశం మొత్తం మీద ఆయనలాంటి హీరో ఉండరేమో!

  |

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఎంతగా అంటే.. తాను కష్టపడి వేసిన బాటలో తన కుటుంబం నుంచి అరడజనుకు పైగా హీరోలు వచ్చారు. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లెందరో ఉన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి హీరోగా ఇదిగాక అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే చిరంజీవికి సంబంధించిన ఒక అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  సామాన్యుడిగా మొదలై

  సామాన్యుడిగా మొదలై

  కొణిదెల శివ శంకర వరప్రసాద్‌గా 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు చిరంజీవి తొలి సంతానం. చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చిరంజీవిని కుటుంబంలో అంతా శంకర్ బాబు అని పిలిచేవారు. తండ్రి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకు మారేవారట, దీంతో చిన్నతనంలో చిరంజీవి తన నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండేవారు. కాలేజ్ విద్య పూర్తయ్యాక సినిమాల మీద ఆసక్తితో ఆయన చెన్నై చేరారు.

  ఆ సినిమాతో ఎంట్రీ

  ఆ సినిమాతో ఎంట్రీ

  ఇక 1978లో ‘పునాదిరాళ్లు' సినిమాతో చిరంజీవి తన నట జీవితాన్ని మొదలుపెట్టారు. చిరంజీవి నటించిన మొదటి చిత్రం ‘పునాదిరాళ్లు' అయినప్పటికీ ‘ప్రాణం ఖరీదు' సినిమాతో చిరంజీవి వెండితెరకు పరిచయమయ్యారు. ‘పునాదిరాళ్లు' 1979లో విడుదలైంది. 1978లో రెండు సినిమాలు మాత్రమే చేసిన చిరంజీవికి ఆ తర్వాత సంవత్సరం నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. అలా అనేక సూపర్ హిట్ సినిమాలు అందుకుని మెగాస్టార్ గా నిలిచారు.

  ఆలోచింపచేసేలా

  ఆలోచింపచేసేలా

  హీరోగా మారడమే కాక అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుంటారు. అలానే ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు. 1998లో ఒక సంఘటన గురించి చిరంజీవి వినడంతో ఈ బ్యాంక్ పుట్టుకొచ్చింది. సమయానికి రక్తం అందక మనుషులు చనిపోతున్నారు అనే విషయం గురించి ఆలోచించి అప్పటికప్పుడు ఆలోచించి బ్లడ్ బ్యాంక్ ను స్థాపించారు. ఆ బ్యాంక్ అనేక మంది ప్రాణాలను కాపాడింది. ఈ 23 ఏళ్లలో కోట్లాది మంది ప్రాణాలను రక్షించడంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంతగానో హెల్ప్ అయ్యింది.

  150 కోట్లకు పైగా సాయం

  150 కోట్లకు పైగా సాయం

  ఇప్పటి దాకా తన సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి ఇప్పటివరకు రూ .150 కోట్లకు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చు చేసి ఉంటారని అంచనా. ఇది భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన స్వచ్ఛంద సేవలు మరెవరూ చేసి ఉండరని అంటున్నారు. చిరంజీవి 1998 లో బ్లడ్ మరియు ఐ బ్యాంకును స్థాపించారు. ఈ బ్యాంకుల ఏర్పాటు వాటి మెయింటెనెన్స్ కోసం ఇప్పటివరకు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారని అంచనా. ఇక ఈ మధ్య ఇటీవల అన్ని తెలుగు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులను కూడా ప్రారంభించారు. ఈ బ్యాంకుల ఏర్పారు కోసం ఆయన రూ .30 కోట్లు ఖర్చు చేసి ఉంటారని అంటున్నారు.

  Sr NTR పై Fanism చాటుకున్న Megastar, 100వ జయంతికి రావాల్సిందే!! || Filmibeat Telugu
  మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం

  మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం

  ఇది కాకుండా, చిరంజీవి కరోనా సమయంలో సినీ కార్మికులకు తాను విరాళం ఇవ్వడమే కాక కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి సాయపడ్డారు. ఇక సంక్షోభ సమయంలో కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఆయన కెరీర్ ప్రారంభం నుంచి స్వచ్ఛంద సేవల కోసం విరాళాల కోసం సుమారు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉండవచ్చని అంటున్నారు. ఆ లెక్కన కాబట్టి చిరంజీవి మొత్తం రూ .150 కోట్లు విరాళంగా ఇచ్చి ఉండవచ్చని అంటున్నారు. ఒకరకంగా చిరంజీవి ఇప్పుడు సేవ చేయడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇది మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం అనే చెప్పాలి..

  English summary
  Megastar Chiranjeevi is not only a actor but has been associated with philanthropic activities from a long time. by his social activities some made an observation that Chiranjeevi so far would have spent close to Rs 150 crore or even more.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X