Godfather రిలీజ్‌కు ముందు మీడియా న్యూసెన్స్.. ఆ కంపు చేస్తారనే భయంతోనే.. చిరంజీవి ఫైర్
గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో చిత్రంలో నటించిన ఆర్టిస్టలందరూ తరలిరావడంతో వేదిక కళకళలాడింది. ఈ సందర్భంగా సీఎంగా నటించిన సర్వదమన్ బెనర్జీ, యూట్యూబర్‌గా పూరీ జగన్నాథ్, నయనతార, మురళీ శర్మ, సునీల్, షఫీ లాంటి నటీనటుల ప్రతిభను చిరంజీవి కొనియాడారు. అలాగే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ మరోస్థాయిని కల్పించిందని చిరంజీవి చెప్పారు. గాడ్‌ఫాదర్ సినిమా టైటిల్‌ను సజెస్ట్ చేసింది తమన్ అని అన్నారు. అయితే ఇలా ఎన్నో విశేషాలతో ముందుకు సాగుతున్న సమయంలో మీడియా వార్తలు మమ్మల్ని అసహనానికి గురిచేశాయి అని చిరంజీవీ అంటూ..

మీడియా వార్తలు చిరాకుగా
మా సినిమా గురించి మీడియా రాసిన వార్తలు చిరాకు కలిగించాయి. భారీగా బడ్జెట్ పెట్టి నిర్మించిన సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో.. చేసుకోవాలో వారికి తెలియదా? సినిమా ప్రమోషన్‌ను ఎలా చేయాలో మీడియా నిర్దేశిస్తే మేము ఏం చేయాలి? మీ పని మీరే చేస్తే అనవసరంగా న్యూసెన్స్ అని చిరంజీవి ఘాటుగా స్పందించారు.

ప్రమోషన్ చేయడం లేదంటూ
మా ప్లానింగ్ ప్రకారం పని చేసుకొంటుంటే.. మీ వార్తలు డిస్ట్రబెన్స్ క్రియేట్ చేశాయి. ఓ సందర్భంలో మోహన్ రాజాతో ఏంటి? ఇలా వార్తలు రాస్తున్నారు. మనమేమన్నా వెనుకబడి ఉన్నామా? అని నేను అంటే.. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి.. సాంగ్, వీఎఫ్ఎక్స్ రావాలి. ఇంకా పది రోజులు ఉన్నాయి. సినిమా విషయంలో మీకు సందేహాలు అక్కర్లేదు అని రాజా చెప్పడంతో ఉపశమనం కలిగింది అని చిరంజీవి చెప్పారు.

అనంతపురంలో ఆ కంపు చేస్తారని..
అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు భారీ వర్షం పడి రసాభసా అయిందని మీడియా రాసి ఇంకా కంపు చేస్తుందనే ఒకే ఒక భయం, కారణంతో నేను వర్షంలో తడిసిముద్దై మాట్లాడాను. ఆ స్పీచ్ ప్రిపేర్ అయి చెప్పింది కాదు. అప్పటికప్పుడు నేను మాట్లాడాను. ఎవరూ మాట్లాడకుండా వర్షం అడ్డంకిగా నిలిచింది. దాంతో అంత టెన్షన్ పడ్డాం. అందుకు మీడియాకు నా థ్యాంక్స్ అని చిరంజీవి అన్నారు.

గాడ్‌ఫాదర్ రిలీజ్ తర్వాత మీడియా
ఇక గాడ్‌ఫాదర్ సినిమా రిలీజ్ తర్వాత నన్ను ఇష్టపడేవారు.. ఇష్టపడని మీడియా తారతమ్యం లేకుండా ఈ సినిమా గురించి బాగా మాట్లాడారు. ఈ సినిమాను అత్యద్భుతంగా ప్రమోట్ చేశారు. ఒక ముసలావిడ మాట్లాడిన మాటలను మీడియా ప్రమోట్ చేసిన విధానం బాగుంది. సినిమా రిలైజన తర్వాత ప్రతీ ఒక్క మీడియా ఈ సినిమా గురించి అత్యద్భుతంగా రాసినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నారు అని అన్నారు.

మంచి రేటింగ్‌తో ఆదరణ
గాడ్‌ఫాదర్ రిలీజ్‌కు ముందు.. సినిమా బాగాలేదని రాసి టెన్షన్ పెట్టారు. ఈ సినిమాను ప్రమోట్ చేసినందుకు థ్యాంక్స్. ఒక్క నెగిటివ్ వార్త లేకుండా.. 3 నుంచి 3.5 రేటింగ్ వేసి ఆదరించారు. విభిన్నమైన కంటెంట్‌తో చిత్రం ఉంటే.. ప్రేక్షకులు ఆదరిస్తారని గాడ్‌ఫాదర్ నిరూపించింది అని చిరంజీవి చెప్పారు. పవర్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రం మంచి ఆదరణ దక్కింది. నా కెరీర్‌లో అత్యద్బుతమైన 15 చిత్రాల్లో గాడ్‌ఫాదర్ కూడా నిలుస్తుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











