మోహన్‌బాబు అలా కెలికాడు.. అవమానం కాదు అంటూ చిరంజీవి.. అలా బాధపడే వాడిని..
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సినీ రచయితల సంఘం ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకొన్నది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ఉద్వేగంగా ప్రసంగించారు. రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సత్యానంద్, ఆకెళ్ల, దర్శకుడు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..

సినీ రచయితలు లేకపోతే
సినీ రచయితల సంఘం సిల్వర్ జూబ్లీ వేడుకలను రావడం చాలా ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమలో అత్యంత దగ్గరగా ఉండేది సినీ రచయితతోనే. ఆ విషయం పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావుకు, సత్యానంద్‌కు తెలుసు. రచయితలకు నేను ఎక్కువగా గౌరవిస్తాను. రచయితలు లేకపోతే మేము లేము. నా మాటలకు బలంగా నిలిచే ఇటీవలనే జరిగింది. అందుకు సాక్ష్యంగా రాఘవేంద్రరావు గారు ఉన్నారు.

మోహన్ బాబు ఇంట్లో
దీపావళీ పండుగ వేడుకల సందర్భంగా మోహన్‌బాబు ఆహ్వానం మేరకు నేను, రాఘవేంద్రరావు, రచయిత సత్యానంద్ వెళ్లాం. అక్కడ అందమైన వెండి సింహాసనం కనిపించింది. అది కనపడగానే సత్యానంద్‌ను అందులో కూర్చొ. ఓ ఫోటోకు ఫోజు ఇవ్వు. చాలా బాగుంటుందని అన్నారు. ఆ సన్నివేశం చూడగానే నాకు చాలా సమంజసం అనే ఫీలింగ్ కలిగింది. ఆ సింహాసనంలో కూర్చొనే అర్హత రచయితగా సత్యానంద్‌కు ఉంది అని మనసులో అనుకొన్నాను.

సత్యానంద్‌ను సింహాసనంపై కూర్చొపెట్టి
సత్యానంద్‌ను వెండి సింహాసనంలో కూర్చొపెట్టడానికి పక్కనే ఉన్న కృష్ణంరాజును పిలిచారు. అంతలోనే అక్కడే ఉన్న మోహన్‌బాబుతోపాటు నేను కూడా వస్తాను అని వెళ్లాను. సత్యానంద్‌కు కాకుండా సినీ రచయిలందరికీ కల్పించే గౌరవం అని భావించా. నేను కూడా ఆ ఫోటో భాగస్వామిని అవుతాను అని స్వయంగా వెళ్లాను. అప్పుడు సత్యానంద్ కాలు మీదు కాలు వేసుకొని కూర్చొ అని అన్నారని చిరంజీవి తెలిపారు.

మోహన్ బాబు ఊరికే ఉండరుగా
అక్కడే ఉన్న మోహన్ బాబు ఊరికే ఉండరు కాదా..ఇక ఈ సన్నివేశాన్ని చూసి ఎప్పుడూ ఏదో కెలుకుతుండుగా.. సత్యానంద్‌ను కూర్చొబెట్టి.. రాఘవేంద్రరావు నిలబెట్టి ఆయనను అవమానిస్తున్నారా? ఆయన దర్శకేంద్రుడు అంటూ మోహన్ బాబు ఏదో అనబోయారు. దాంతో నేను వెంటనే.. రాఘవేంద్రరావు అమరశిల్పి జక్కన్న లాంటి వారు. ఉలి, సుత్తి ఆయన చేతిలో ఉంటుంది. శిల ఉంటేనే ఆయనే చెక్కేది.. అలాంటి కంటెంట్‌ను ఆయన చెక్కి మంచి శిల్పాలను సినీ పరిశ్రమకు అందించారు. మంచి మాటలు, పాటలు వాళ్లు రాయకపోతే మనతో వారు ఉండరు అని మోహన్‌బాబును అనుకరిస్తూ చిరంజీవి చెప్పారు.

నేను బాధపడే వాడిని..
ఎన్నో ఏళ్లుగా రచయితలతో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రతీ ఒక్కరితో నాకు ప్రొఫెషనల్‌గా కాకుండా వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. అలాంటి రచయితల వేడుకలకు ఒకవేళ నన్ను పిలువకపోతే నేను బాధపడే వాడిని. ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చి గొప్ప అనుభూతిని పొందే ఛాన్స్ దక్కింది. అలాగే గొప్ప వాళ్లను సన్మానించే అవకాశం రావడం నా జీవితంలో చేసుకొన్న గొప్ప అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











