Don't Miss!
- Sports
Brett Lee Advice: కోహ్లీకి ఇంతకంటే మంచి టైం దొరకదు.. కచ్చితంగా ఈ టైం ఉపయోగించుకోవాలి
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Unstoppable మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ఎందుకు రాలేదు? బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే?
నట సింహ నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతోనే కాకుండా Unstoppable టాక్ షోతో దేశవ్యాప్తంగా మరింత పాపులారిటిని సంపాదించారు. ఆహా ఓటీటీలో ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే బాలయ్య బాబు హోస్ట్‌గా Unstoppable టాక్ షో తొలి సీజన్‌ను ఘనంగా ముగించుకోబోతున్నది. ఈ ఈ టాక్ షోకు రచయితగా వ్యవహరిస్తున్న బీవీఎస్ రవి ఇటీవల పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..

దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్‌తో
తెలుగు వినోద రంగంలో విభిన్నమైన కంటెంట్‌తో ముందుకెళ్తున్న ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణతో టాక్ షోను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేయగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. బాలకృష్ణ ప్రారంభించిన టాక్‌షోకు మంచి రెస్పాన్స్ లభించింది. దేశవ్యాప్తంగా టాప్ టీఆర్పీని సాధించింది. జాతీయ ఛానెల్లో టాప్ రేటింగ్ సాధిస్తున్న ది కపిల్ శర్మ షోతో పోటీ పడింది.

మహేష్ బాబుతో చివరి ఎపిసోడ్
Unstoppable Show టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తూ పది ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. ఈ షో చివరి ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రికార్డు స్థాయిలో నాలుగు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. దాంతో సీజన్ 1 చివరి ఎపిసోడ్లో బాలయ్య, మహేష్ బాబు మధ్య జరిగిన సంభాషణ గురించి ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.

వెంకటేష్ ఎందుకు రాలేదంటే?
Unstoppable Show గురించిన తెర వెనుక విషయాలను వెల్లడిస్తూ.. చిరంజీవిని, వెంకటేష్‌ను తాము ఆహ్వానించాం. కొందరికి వీలు అయిది. మరికొందరికి వీలు కాలేదు. కానీ బాలకృష్ణ గాయం కారణంగా వెంకటేష్ షోకు రాలేకపోయారు. ఆ తర్వాత వెంకటేష్ వెబ్ సిరీస్‌లో నటించడం కారణంగా మళ్లీ షోకు రావడానికి వీలు కాలేదు. వాస్తవానికి రానా, వెంకటేష్ కలిసి ఫోలో పాల్గొనాలి. వీలు కాకపోవడం వల్ల వెంకటేష్ మరోసారి ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది అని బీవీఎస్ రవి తెలిపారు.

సీజన్ 2 ఎపిసోడ్లో చిరంజీవి
ఇక
బాలయ్య
షోలో
చిరంజీవి
కూడా
పాల్గొనడానికి
చాలా
ఆసక్తిగా
ఉన్నారు.
కాకపోతే
ఆచార్య
డబ్బింగ్,
ప్యాచ్
వర్క్,
భోళా
శంకరుడు,
గాడ్‌ఫాదర్
సినిమా
షూటింగులతో
బిజీగా
ఉన్నారు.
అన్నీ
కుదిరితే..
సీజన్
2లో
ఫస్ట్
ఎపిపోడ్‌లో
చిరంజీవి
పాల్గొనే
అవకాశం
ఉంది.
ఇందుకోసం
భారీగా
కసరత్తు
జరుగుతున్నది.
వారిద్దరి
మధ్య
సంభాషణ
కోసం
ప్రశ్నల
గురించి
రీసెర్చ్
చేస్తున్నాం
అని
బీవీఎస్
రవి
అన్నారు.

బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే?
అలాగే
Unstoppable
Show
లో
పాల్గొన్నందుకు
బాలకృష్ణకు
ఎంత
రెమ్యునరేషన్
ఇచ్చారనే
విషయం
నాకు
తెలియదు.
కానీ
బాలయ్యతో
షో
చేసినందుకు
ఆహాకు
మంచి
బెనిఫిట్
లభించింది.
రేటింగ్
పెరగడంతోపాటు..
భారీగా
సబ్
స్క్రిప్షన్
వచ్చాయి.
ఈ
షోతో
ఆహాలోని
ఇతర
కంటెంట్,
సినిమాల
వ్యూస్
భారీగా
పెరిగాయి.
బాలయ్యతో
మంచి
మ్యాజిక్
వర్కవుట్
అయింది
అని
బీవీఎస్
రవి
పేర్కొన్నారు.