కొరటాల ఎదురుచూపులకు తెరపడేది అప్పుడేనా!
రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు చాలా గ్యాప్ తీసుకుని సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు, కొరటాల శివ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. కొరటాల శివ కథతో రెడీగా ఉన్నారు. కానీ సైరా చిత్రం పూర్తి కాకపోవడంతో ఆయనకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఇదిలా ఉండగా సైరా షూటింగ్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సైరా చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదుల చేయనున్నట్లు రాంచరణ్ ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్‌లో తెలియజేశారు. తాజా సమాచారం ప్రకటం సైరా షూటింగ్ జూన్ నెలలో పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. వెంటనే అదే నెలలో కానీ జులైలో కానీ కొరటాల, చిరు చిత్రం ప్రారంభం అవుతుందట.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కొరటాల శివ పలువురు హీరోయిన్లని పరిశీలిస్తున్నారు. శృతి హాసన్ ఈచిత్రంలో కీలక పాత్రలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి రైతు పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి కూడా రాంచరణే నిర్మాత అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











