రాజమౌళి డైరెక్షన్ లో చిరంజీవి చేయాల్సిన సినిమా... ఎలా మిస్సైంది? ఆ మూవీ ఏంటీ?

పద్మవిభూషణ్, మెగా స్టార్ చిరంజీవి ఆరుపదుల వయస్సు దాటినా ఇంకా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు మరింతగా జోస్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. యంగ్ హీరోలకే షాక్ ఇచ్చే యాక్షన్, డ్యాన్స్ లతో ఇరగదీస్తున్నారు. చివరిగా బాస్ 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ లో దుమ్ములేపుతున్న యంగ్ అండ్ లీడింగ్ డైరెక్టర్స్ తో కలిసి వర్క్ చేస్తున్నారు.

చిరంజీవి 'పునాది రాళ్ల' నుంచి టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లందరీతోనూ కలిసి పనిచేశారు. బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. 160 చిత్రాల వరకు అన్నీ దాదాపు హిట్ చిత్రాలనే ప్రేక్షకులకు అందించారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లినా.. మళ్లీ 'ఖైదీ నెంబర్ 150'తో తిరిగి ఇండస్ట్రీలోకే వచ్చారు. ఇక అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. పైగా ఈ తరం దర్శకులతోనూ కలిసి పనిచేస్తున్నారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఫిదా చేస్తున్నారు. కాగా చిరంజీవి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలని మిస్ అయ్యాడంట. జక్కన్న డైరెక్షన్ లో సినిమా చేయాలని మెగాస్టార్ ఎంతగానో ఉవ్విల్లూరారని స్వయంగా దర్శకధీరుడే చెప్పాడం విశేషం.

Chiranjeevi missed to Act in SS Rajamouli Direction Do you know which film is that

అయితే జక్కన్న - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'మగధీర' ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు టాలీవుడ్ లో మొదటి రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. 2009లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ ఆడియెన్స్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ తేజ్ కోసమే ప్రత్యేకంగా రెడీ చేయించారంట. చరణ్ ను ఒప్పించేందుకు మొదట చిరంజీవిని కలిసి స్టోరీ చెప్పారంట.

అక్కడే.. చిరంజీవి కాస్తా టెంప్ట్ అయ్యి ఆ సినిమా స్టోరీ తనకోసమే చెబుతున్నాడని చిరంజీవి ఊహించుకొని.. తనే హీరోగా ఫిక్స్ అయిపోరాంట. కానీ అది చరణ్ కోసం తీసుకొచ్చిన సినిమా అని చెప్పడంతో మెగాస్టార్ ఆశలు ఆవిరై పోయాయంట. అయితే జక్కన్న కథ చెప్పగానే ఇలాంటి కథలో తానెప్పుడు నటించలేదని, నటించే అవకాశం రాలేదని జక్కనతో తన ఫీలింగ్ ను షేర్ చేసుకున్నారంట. 'మగధీర' చిత్రంలో చిరంజీవినే నటించాలని భావించారంట... కానీ చరణ్ కోసమంటూ జక్కన్న ఇచ్చిన ట్విస్ట్ తో రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి నటించే ఛాన్స్ మిస్ అయ్యింది.

ప్రస్తుతం రాజమౌళి ఏ రేంజ్ ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తున్నారో తెలిసిందే. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి 'ఎస్ఎస్ఎంబీ29' చిత్రాన్ని షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అల్యూమిలియం ఫ్యాక్టరీలో ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరణ కొనసాగుతోంది. మరోవైపు మెగాస్టార్ వశిష్ఠ దర్శకత్వంలోని 'విశ్వంభర'లో నటిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెలతోనూ మరో ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఆర్సీ16'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X