Padma Vibhushan ఒక కన్నతల్లి కడుపులో పుట్టకపోయినా.. పద్మ విభూషణ్ అవార్డుపై చిరంజీవి భావోద్వేగం
ఇండియన్ సినిమా రంగంలో సూపర్ స్టార్లలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతీ ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో ఆయనకు పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇప్పటికే పద్మ భూషణ్ అవార్డు అందుకొన్న ఆయనకు దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు పండగ చేసుకొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆయన జెండాను ఎగురవేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..
Recommended Video

పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలియగానే ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. మన దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు చాలా సంతోసంగా ఉంది. తమ కన్నతల్లి కుటుంబంలో పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు. నా సినీ కుటుంబం అండదండలు, నన్ను నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ఆదరణ, ప్రేమ, అభిమానుల కారణంగానే నేను ఈ స్థితిలో ఉన్నాను.

నాకు దక్కిన గౌరవం మీది. మీరు నాపై చూపించిన ప్రేమకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రలతో వినోదం పంచడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను అని చిరంజీవి అన్నారు.
నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సహాయం అందిస్తున్నాను. కానీ నాపై మీరు చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను పెద్దగా ఇస్తున్నది గోరంత మాత్రమే. ఈ విషయం ప్రతీ క్షణం గుర్తు చేస్తుంది. నన్ను బాధ్యతగా నడుచుకొనేలా చేస్తుంది అని చిరంజీవి అన్నారు.
ఈ ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్ అంటూ తన అనుభూతిని పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











