చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ... వీరిలో కింగ్ మేకర్ ఎవరంటే?
2024 వచ్చి అప్పుడే నెల అయిపోతోంది. ఇప్పటికే సంక్రాంతి, రిపబ్లిక్ డే సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చి విజయాలు, అంతకు మించిన అపజయాలను చూశాయి. అయితే ఇప్పుడు సినీ ప్రియులకు అసలైన సినీ వినోదాన్ని అందించడానికి రెడీ అవుతున్నాయి మరిన్ని చిత్రాలు. విషయానికొస్తే.. తెలుగు సినిమాలకు ప్రస్తుతం ఓవర్సీస్‌లో మార్కెట్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ మన చిత్రాలకు భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్లో రాణిస్తున్న బడా హీరోల్లో ఓవర్సీస్‌లో ఎవరికి ఏ రేంజ్ మార్కెట్ ఉంది? వీరిలో కింగ్ మేకర్ ఎవరు వంటి వివరాలను తెలుసుకుందాం..
టాలీవుడ్ నుంచి రాబోతున్న బాగా హైప్ ఉన్న చిత్రాల్లో 'పుష్ప 2', 'ఓజీ', 'దేవర', 'గేమ్ ఛేంజర్', 'విశ్వంభర', 'కల్కి' . ఇంకా పలు చిత్రాలు కూడా ఫుల్ హైప్‌తో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో 'కల్కి' బిజినెస్ ఇంకా మొదలు కాలేదని తెలిసింది. కానీ ఇతర సినిమాలకు మాత్రం చాలా వరకు బిజినెస్ ముందుగానే జరిగినట్లు సమాచారం అందింది.

గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రభాస్ 'సలార్' ఓవర్సీస్‌లో భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. రూ.72కోట్ల వరకు అమ్ముడుపోయిందని తెలిసింది. అంతకుముందు 'బాహుబలి 2' రూ. 70కోట్ల రేట్ పలకగా 'ఆర్‌ఆర్‌ఆర్' రూ.68కోట్లకు అమ్ముదుపోయిందని సమాచారం. అలా ఈ మూడు సినిమాలు ఓవర్సీస్‌లో అత్యధిక ధర పలికిన సినిమాలుగా రికార్డుకెక్కాయి.
ఇప్పుడు ఆ రికార్డులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 బ్రేక్ చేసే అవకాశముందని తెలుస్తోంది. 'పుష్ప 2'కు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ ఉందట. రూ.90 కోట్ల వరకు పలుకుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ డీల్‌పై ఇంక్లా స్పష్టట లేదు. ఒకవేళ ఈ డీల్ కనుక సక్సెస్‌ఫుల్‌గా జరిగితే హీరోల్లో బన్నీదే హైయెస్ట్ రికార్డ్ ఓవర్సీస్ బిజినెస్ అవుతుంది. ఈ చిత్రం ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కానుంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ స్టర్ మూవీ ఓజీ మూవీ ఓవర్సీస్ రైట్స్ రూ.17కోట్లకు అమ్ముడుపోయిందని తెలిసింది. పుష్ప 2 కనుక వాయిదా పడితే, ఆగస్ట్‌లో ఈ సినిమా విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే 72శాతం షూటింగ్ పూర్తైంది. శంకర్ - రామ్‌చరణ్ కాంబో మూవీ 'గేమ్ ఛేంజర్' ఓవర్సీస్ రైట్స్ రూ. 20కోట్లకు అమ్ముడైందని సమాచారం అందింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ రూ.18కోట్లకు అమ్ముడు పోయిందని టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగు నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం ఎన్టీఆర్ 'దేవర' రూ.27కోట్లకు అమ్ముడు పోయినట్టు అంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే... ఓవర్సీస్ కింగ్ మేకర్ పుష్పగాడే అని తెలుస్తోంది. ఓవర్సీస్ లో పుష్ప 2 రికార్డు బిజినెస్ నమోదు చేసుకోవడంతో.. బన్నీ కింగ్ మేకర్. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











