ఒకే నెలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డు..కారణం ఎవరో తెలుసా?

చాలా మంది కొన్ని సెంటిమెంట్స్ ని నమ్ముతూ ఉంటారు అలాగే మన తెలుగు సినిమాలో కూడా సెంటిమెంట్స్ కూడా ఒకింత ఎక్కువే అని చెప్పాలి. అది సినిమా టైటిల్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనే దాని నుంచి ఈ హీరోయిన్ ని పెట్టుకుంటే హీరోయిన్ని పెట్టుకుంటే ప్లాప్ అవుతుంది అని ఇలా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. కాగా మన ఇళ్లల్లో కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ని చాలా మంది నమ్ముతారు.

ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో పెద్దలు నమ్ముతారు. కాగా మన తెలుగు సినిమా దగ్గర ఇప్పుడు ఇదే సెంటిమెంట్ మెగా కుటుంబంలో బాగా క్లిక్ అయ్యినట్టు మరోసారి హాట్ టాపిక్ నడుస్తుంది. కాగా మెగాస్టార్ చిరంజీవి నట వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే తన భార్య ఉపాసన కొణిదెలకి ఎన్నో ఏళ్ళు తర్వాత కలిగిన మొదటి సంతానమే క్లిన్ కారా కొణిదెల.

chiranjeevi pawan kalyan world records also klin kara credits

అయితే దీనికి ముందు చరణ్, ఉపాసనలపై ఎన్నో కామెంట్స్ వినించాయి. కానీ ఎట్టకేలకి క్లిన్ కారా రాకతో మెగా కుటుంబంలో పలు భారీ మార్పులే చోటు చేసుకున్నాయని చెప్పాలి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రేంజ్ లెవెల్ కి ఎదగడం నుంచి మెగాస్టార్ చిరంజీవికి భారతదేశం లోనే రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ అవార్డు అందుకోవడం కోసం కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొట్ట మొదటి జాతీయ అవార్డు అందుకోవడం..

అలాగే ముఖ్యంగా మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలవడం అది కూడా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలవడం వంటివి అన్నీ క్లిన్ కారా వచ్చిన తర్వాతే జరిగాయి. దీనితో ఆల్రెడీ మెగా కుటుంబానికే చరణ్ కూతురు ఒక లక్కీ ఛార్మ్ గా నిలిచిపోయింది. అయితే ఇవన్నీ నార్మల్ గానే అనుకోవచ్చు కానీ ఇటీవల మెగా బ్రదర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ వరల్డ్ రికార్డ్స్ సెట్ చేయడం అనేది క్రేజీ అంశంగా మారింది.

chiranjeevi pawan kalyan world records also klin kara credits

కాగా పవన్ కళ్యాణ్ ఒక్క రోజులోనే 13 వేలకి పైగా పంచాయితీ గ్రామా సభలు నిర్వహించి వరల్డ్ రికార్డుని కేవలం కొన్ని రోజులు కితమే అందుకోగా ఈ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని తన డాన్స్ లు పరంగా అత్యధిక మూమెంట్స్ చేసిన హీరోగా మెగాస్టార్ ని గిన్నీస్ వరల్డ్ రికార్డు వరించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా బ్రదర్స్ ఇద్దరూ వరల్డ్ రికార్డ్స్ అందుకోవడం అనేది చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పొచ్చు.

chiranjeevi pawan kalyan world records also klin kara credits

మరి ఇది కూడా లక్కీ ఛార్మ్ క్లిన్ కారా ఖాతాలోకే అభిమానులు ఇస్తున్నారు. మెగా ఇంట వచ్చిన అదృష్ట లక్ష్మి మా క్లిన్ కారా అని ఆమె వచ్చిన తర్వాతే మెగా హీరోస్ అందరికీ ఇలాంటి అదృష్టాలు దక్కుతున్నాయని మెగా అభిమానులు ఎలాంటి సందేహం లేకుండా చెబుతున్నారు. ఇక నెక్స్ట్ క్లిన్ కారా తండ్రి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భారీ సినిమా గేమ్ ఛేంజర్ తో పెద్ద హిట్ కొట్టడం ఒకటే బాకీ ఉందని అభిమానులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X