Chiranjeevi 50: 50 ఏళ్ల మెగాస్టార్ నట ప్రస్థానం..చిరంజీవి పోస్టు వైరల్!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని సినిమా ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిని ప్రస్థానాన్ని ప్రారంభించిన చిరంజీవి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. టాలీవుడ్ టాప్ హీరో స్థాయికి ఎదిగారు. చిరంజీవి తన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అయితే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన నట ప్రస్థానం గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి సపోర్టు, సినిమా బ్యాక్ డ్రాప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎన్నో ప్రయత్నాల తరువాత 'పునాది రాళ్లు' సినిమా ద్వారా తొలిసారి వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఈ మూవీలో తన నటనతో చిరంజీవి మెప్పించారు. చిరంజీవి బెస్ట్ యాక్టర్. నవరసాల్లో ఏ ఆయన రసానైనా అలవోకగా పండించగల టాలెంటెడ్ హీరో చిరంజీవి. అలాగే ఆయన కామెడీ టైమింగ్ కూడా మరో లెవల్. ఎవ్వరైనా ఆయన కామెడీకి నవ్వాల్సిందే.

ఇక చిరంజీవి డ్యాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. చిరు డ్యాన్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండంటే.. అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవడానికి మూవీ మేకర్స్ చిరు సినిమాలో కచ్చితంగా ఆరు పాటలు పెట్టేవారు. అందుకు తగ్గట్టుగానే చిరంజీవి తన అల్టిమేట్ డాన్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేవారు. ఇటీవల చిరంజీవి తన సినిమా కెరీర్ లో 156 సినిమాలో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను మెగాస్టార్ పేరు గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. ఈ అరుదైన రికార్డును బట్టి చిరంజీవి డ్యాన్స్ ఎంత స్పెషల్ లో చెప్పవచ్చు.
ఆరుపదుల వయస్సులోనూ యంగ్ హీరోయిన్ తో పోటీ పడుతూ స్టార్ హీరోగా నిలుస్తున్నారు. దాదాపు తన కెరీర్ లో 30 ఏళ్లపాటు టాలీవుడ్ టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే.. ఆయన రేంజ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే చిరంజీవి తన నట జీవితంలో ఎన్నో అవార్డులు పురస్కారాలు, భారత ప్రభుత్వం అందించే పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లను కూడా కైవసం చేసుకున్నారు. అయితే.. తాజాగా చిరంజీవి తన నట ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ.. స్పెషల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
‘రాజీనామా' .. Y N M College Narsapur లో 'రంగస్థలం' మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు .. అది Best Actor కావటం .. ఎనలేని ప్రోత్సాహం .. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం .. ఎనలేని ఆనందం ! 🙏 pic.twitter.com/CfobnApui8
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 26, 2024
చిరంజీవి తొలి సినిమా 'పునాదిరాళ్లు' అని అందరి తెలిసిందే. ఈ మూవీలో సైడ్ హీరోగా నటించిన చిరంజీవి తనదైన ప్రతిభతో నేడు స్టార్ హీరోగా ఎదిగారు. అయితే చిరంజీవికి నటుడిగా తొలి అడుగు పడింది మాత్రం తన కాలేజ్ డేస్ లోనే.. చిరంజీవి డిగ్రీ రెండవ సంవత్సరంలో 'రాజీనామా' అనే నాటకాన్ని వేశారు. ఈ నాటకానికి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజీ అవార్డ్ (1974-75) వచ్చింది. తొలి నాటకం వేసిన సందర్భంగా తీసుకున్న ఆనాటి ఫోటోను 50 సంవత్సరాల నట ప్రస్థానం .. ఎనలేని ఆనందం అంటూ.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. శుభాకాంక్షలు తెలుపుతూ.. కాలేజ్ డేస్ లో చిరంజీవి అందంగా ఉన్నాడంటూ చిరంజీవి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అది కాస్త మెగా అభిమానులకు చాలా స్పెషల్ అనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చిరులో ఎంత మారిపోయారో అని చిరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











