పెద్దదైన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం: ఏడాది కాలంలోనే ఇంత మంది వచ్చేశారు
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. దాదాపు నలభై ఏళ్లుగా పరిశ్రమలో తన హవాను చూపిస్తోన్న ఆయన.. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ మెగా హీరో.. కొన్నేళ్ల క్రితం 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి తన పంథాను మార్చుకుని.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 2020 మార్చిలో ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో అంశాలపై ఆయన స్పందిస్తూ అందులో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన అంశాలను కూడా ఫ్యాన్స్‌కు వెల్లడిస్తున్నారు. అలాగే మూవీ అప్‌డేట్లు కూడా దీని ద్వారా ఇస్తున్నారు. దీంతో ట్విట్టర్‌లో చిరంజీవిని ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఒక మిలియన్ ఫాలోవర్ల (పది లక్షల మంది) మార్కును చేరుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే ఈ మైలురాయిని చేరుకున్న సీనియర్ హీరోగా నిలిచారాయన.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దీనితో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసీఫర్' రీమేక్‌ను సైతం అధికారికంగా ప్రారంభించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది. వీటి తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ చేయనున్నారు. అనంతరం కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారాయన.


Click it and Unblock the Notifications











