twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆచార్య ఫ్లాప్‌పై చిరంజీవి సెటైర్.. ఆ సినిమా గురించి మాట్లాడుకోవద్దు అంటూ మెగాస్టార్ కామెంట్

    |

    బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఒక సినిమాను తెలుగులో ప్రజెంట్ చేయడం చిరంజీవి కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాగచైతన్య, చిరంజీవి, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇస్తూ..

    లాల్ సింగ్ చద్దాను సమర్పించడానికి

    లాల్ సింగ్ చద్దాను సమర్పించడానికి


    లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్‌కు ముందు వర్క్‌షాప్ నిర్వహించారు. డైలాగ్స్ బట్టీ పట్టించారు. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించారు. దాని వల్ల సెట్లో ఫెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సినిమా అంటే ఆయన చెప్పలేనంత మమకారం. అందుకే అమీర్ అడగ్గానే.. ఇంతకు ముందు సమర్పించామా? లేదా అనే విషయాన్ని ఆలోచించకుండా లాల్ సింగ్ చద్దాను సమర్పించడానికి నిర్ణయం తీసుకోన్నాను. అసలు సమర్పించడం అంటే కూడా నాకు తెలియదు. ఈ సినిమాకు నా పేరు ఉపయోగపడితే నాకు అంతకంటే ఆనందం మరోటి ఉండదు అని చిరంజీవి చెప్పారు.

     అమీర్ ఖాన్ నటన కదిలించింది

    అమీర్ ఖాన్ నటన కదిలించింది

    లాల్ సింగ్ చడ్డా చిత్రం చూసిన తర్వాత నేను భావోద్వేగానికి గురయ్యాను. ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటన నన్ను కదిలించింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఆ పాత్రను నేను చేస్తే ఎలా బాగుండేదా అనే విషయం నాకు అనిపించలేదు. ఎందుకంటే.. అలాంటి పాత్రలు చేయడం అమీర్‌ఖాన్‌కే సాధ్యం. నేను ఆ ధైర్యం చేయలేదు. నేను జనామోదంగా ఉండే సినిమాలు. జనరంజకంగా ఉండాలి. మినిమమ్ గ్యారెంటీ ఉండే సినిమాలు మాత్రమే నేను చేస్తాను అని చిరంజీవి చెప్పారు.

    మన ప్రమేయం లేకుండా అంటూ సెటైర్

    మన ప్రమేయం లేకుండా అంటూ సెటైర్


    జనాన్ని మెప్పించి.. ఒప్పించేలా అమీర్ ఖాన్ పాత్రలు పోషిస్తాడు. జనాలకు ఏం నచ్చుతుంటాయి. ఏం చేస్తే చప్పట్లు కొడుతారు? ఎలాంటి పాత్రలు వేస్తే జనం శభాష్ అంటారో అలాంటి పాత్రలు చేయడానికి నేను ప్రయత్నిస్తుంటాను. కానీ కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతుంటాయి. వాటి గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. మధ్య మధ్యలో అలా జరిగిపోతుంటాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు అంటూ ఇటీవల ఆచార్య ఫలితం గురించి పరోక్షంగా తనపై తాను చిరంజీవి సెటైర్ వేసుకొన్నారు.

    ఇంద్ర రిలీజ్ గురించి

    ఇంద్ర రిలీజ్ గురించి


    జూలై 24వ తేదీన రిలీజైన ఇంద్ర సినిమాను గుర్తు చేసుకొని చిరంజీవి థ్రిల్ అయ్యారు. 20 ఏళ్ల క్రితం రిలీజైన మూవీ. నా కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా. నాకు మంచి పేరు తెచ్చింది. జూలై 23వ తేదీన పసిపాడి ప్రాణం సినిమా రిలీజ్, ఆ సినిమా సాధించిన విజయం గురించి అమీర్ ఖాన్‌తో చిరంజీవి పంచుకొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంద్ర, పసివాడి ప్రాణం లాంటి సినిమాలు అందించినందుకు, వాటి విజయాలను గుర్తు చేసుకొని అమీర్ ఖాన్ చప్పట్లతో ప్రశంసించారు.

    అమీర్‌తోపాటు మేము ఏడ్చాం

    అమీర్‌తోపాటు మేము ఏడ్చాం

    తన ఇంట్లో లాల్ సింగ్ చద్దా సినిమా స్పెషల్ షో సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తు చేసుకొన్నారు. సినిమా చూసిన తర్వాత నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య పది నిమిషాలు ఏమీ మాట్లాడుకుండా ఉండిపోయాం. అమీర్ ఖాన్ మా పరిస్థితి కంగారు పడ్డారు. సినిమా కలిగించిన భావోద్వేగం నుంచి బయటకు వచ్చి మేము అమీర్ ఖాన్‌ను ప్రశంసిస్తే.. ఎమోషన్‌ను తట్టుకోలేక ఆయన ఏడ్చారు. ఆయన ఏడ్చినది కనిపించింది. మేము ఏడ్చినది కనబడలేదు అని చిరంజీవి తనదైన శైలిలో చెప్పారు.

    English summary
    Chiranjeevi, Aamir Khan and Naga Chaitanya had a Media Interaction at Laal Singh Chaddha orgnised in Hyderabad. In this press meet, Chiranjeevi indirectly made satire on Acharya Flop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X