రామ్ చరణ్‌కు బ్యాడ్ నేమ్ వస్తుంది, అలా చేయొద్దని సురేఖ అనేది: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. అక్టోబర్ 2న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం(ఆగస్టు 20) ముంబైలో టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా చిత్ర బృందం నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టింది.

సైరా షూటింగుకు మేకప్ వేసుకుని రెడీ అవ్వడానికి ఒక గంట సమయం పట్టేది. ఈ వయసులో నేను ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చేయడం కొంతకష్టమైన పనే. అయితే రామ్ చరణ్, సురేందర్ రెడ్డి నేను మరింత కష్టపడేలా చేశారు. ఈ కథ విన్నపుడు యాక్షన్ సీన్లు డూప్‌తో చేయిస్తారు, టెక్నీలజీ ఉంది అనుకున్నాను. కానీ వీరు కాంప్రమైజ్ కాకుండా ఆ సీన్లన్నీ నాతోనే చేయించారు. అప్పటికీ నా భుజానికి ఒకసారి సర్జరీ అయింది. అలాంటి నేను కత్తి తిప్పుడూ యుద్ధం చేయడం, గుర్రపు స్వారీ చేయడం చాలా కష్టం. అయితే దీన్ని నేను ఎప్పుడూ కష్టంగా ఫీలవ్వలేదు. హ్యాపీగా చేశాను. ఎంజాయ్ చేస్తూ చేశాను అని చిరంజీవి తెలిపారు.

Chiranjeevi remembers funny incident at Sye Raa teaser release event

సెట్లో ఉదయం 7 గంటలకు ఫస్ట్ షాట్ మొదలవుతుంది. 4.30 గంటలకు లేచి గంట పాటు వర్కౌట్లు చేసి షూటింగుకు సిద్దమైపోయేవాడిని, ఈ చిత్ర సమర్పకురాలు, నా భార్య సురేఖ.. ఒక రోజు మీరు ఇలా చేయకండి అని చెప్పింది. ఎందుకు? అని అడిగాను... మీరు నా కొడుకును చెడగొడుతున్నారు అంది. మీరు ఇంత పక్చువల్‌గా ఉంటే నా కొడుక్కు చెడ్డపేరు వస్తుంది అనేది. నేను సినిమాను అంత ఎంజాయ్ చేస్తూ చేశాను కాబట్టే అలా పంక్చువల్‌గా ఉండగలిగాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X