Waltair Veerayya: విశాఖలో చిరంజీవి కొత్త ఇల్లు.. చిరకాల కోరిక అంటూ వైజాగ్ ప్రజలపై మెగాస్టార్ ప్రశంసలు
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్టీలో వెలుగొందిన హీరో చిరంజీవి. స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ గా మారారు. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ అందిరికా బాస్ గా అందరివాడు అయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఖైదీ నెం 786 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్యగా మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను తాజాగా కొన్న ల్యాండ్ గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు చిరంజీవి.

ఇద్దరు స్టార్ హీరోలు..
బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ అలరించనున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అనేక చిత్రాలను సపోర్ట్ చేస్తూ..
అభిమానుల అంచనాలకు తగినట్లుగానే వాల్తేరు వీరయ్యను పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందుకోసం రిస్కీ షాట్స్ కూడా చేసేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సమస్యలపై రియాక్ట్ అయి తనవంతుగా సహాయం చేసే చిరు అనేక చిత్రాలకు సపోర్టింగ్ గా తన వాయిస్ ను ఇస్తుంటారు. ఇక చిరంజీవి అదిరిపోయే డ్యాన్స్ లకు, క్రేజీ ఫైట్స్ కు పెట్టింది పేరు.

వింటేజ్ లుక్ లో చిరు..
ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో మరోసారి తన స్టెప్పులు, ఫైట్స్ తో అభిమానులకు సంక్రాంతి పండుగ ట్రీట్ ఇవ్వనున్నారు చిరు. అందుకోసం డూప్ లేకుండా రిస్కీ షాట్స్ చేసేందుకు రెడీ అయ్యారు. చిరంజీవి పడిన కష్టమంతా ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో కనపిస్తుంది. వింటేజ్ లుక్ లో అదరగొట్టారు చిరంజీవి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా నిర్వహించారు.

వైజాగ్ సిటీ అందం గురించి..
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యాంకర్ సుమ హోస్ట్ చేయగా.. ఈ కార్యాక్రమానికి చిరంజీవి, రవితేజ, బాబీ, నిర్మాతలు, రైటర్స్, దేవీ శ్రీ ప్రసాద్ తోపాటు ఊర్వశీ రౌటేలా, కేథరీన్ ట్రేసా హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్ లో తనదైన స్టైల్ లో మాట్లాడి అలరించారు మెగాస్టార్ చిరంజీవి. ఈవెంట్ లో మాట్లాడుతూ వైజాగ్ సిటీ అందం గురించి చెప్పుకొచ్చారు. ఈ వైజాగ్ అంటే ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు.

విశాఖ ప్రజలు శాంతికాముకులు..
"వైజాగ్ సీ షోర్ ఇష్టం. వెరసీ నాకు అనిపిస్తుంటుంది. నేను గతంలో చాలాసార్లు అన్నాను. ఇక్కడ ఒక స్థలం కొనుక్కుని హాలీడే హోమ్ లాగా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరితో అంటాను.. ఇది రిటైర్ మెంట్ అయ్యాక సెటిల్ అవ్వాల్సినటువంటి ఒక చక్కటి స్వర్గ ధామం ఈ విశాఖపట్నం. ఈ వాల్తేరు. నిజంగా ఇక్కడి విశాఖ ప్రజలు శాంతికాముకులు. విశాలమైన మనసున్న వారు. కుల్లు కుతంత్రాలకు తావు ఇవ్వరు. సరదాగా ఉంటారు. అలా రామకృష్ణ బీచ్ లో సాయంత్రం సరదాగా గడుపుతూ ఇంటికి ఫ్యామిలీతో వెళ్లిపోతుంటారు. సినిమాలు బాగుంటే చూస్తారు" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఒక స్థలం కొనుకున్నాను..
"విశాఖలో ఒక కాస్మోపాలిటన్ అటువంటి కల్చర్ ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది ఆ డిగ్నిఫైడ్ బిహేవియర్. అందుకనే నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలను అనిపిస్తుంటుంది. ఇన్నాళ్లు నేను మాట మాత్రమే చెబుతున్నాను. ఈ మధ్యే ఒక స్థలం కొనుక్కున్నాను. అది భీమిలీ వెళ్లే దారిలో. కాబట్టి ఇకా ఇల్లు కట్టే ప్రయత్నం చేయాలి, చేసి నేను కూడా మీలగా విశాఖ వాసున్ని అవుతాను. ఇలాంటి అద్భుతమైన విశాఖపట్నానికి నేను ఒక పౌరుడిని అయితే.. నా ఆనందం అంతా ఇంతా కాదు. ఇది నా చిరకాల కోరిక" అని మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ లో కొన్న ల్యాండ్ గురించి తెలిపారు.


Click it and Unblock the Notifications











